మన ఎమోషన్ పిక్చర్స్ బ్యానర్ పై విడుదల కానున్న ఆరాధ్య చిత్రం నుండి నేడు ఒక అద్భుతమైన పాటను విడుదల చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ‘నీ పుట్టుకే ఓ వరం’ అంటూ మనసుని హత్తుకునే పాటను విడుదల చేయడం జరిగింది. కెపిఎస్ చిన్న రచన దర్శకత్వంలో వచ్చిన ఈ పాటకు గోపినాథ్ కొండ సంగీతం అందించగా డానియల్ మదాసు సినిమాటోగ్రఫీ అందించారు. పాటను విన్న వేడుకలో ఉన్న వారు అంతా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. పాటలో నటించిన పాప అలాగే తండ్రి పాత్ర చాలా బాగా నటిస్తూ పాటలను ఎమోషన్ అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్లారు.



