రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో విఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న చిత్రంలో వెంకట్, రవీందర్,శ్రీహరి,హెబ్బపటేల్, సలోని, నాటషా సింగ్, షానీ, ఆదిత్య, చాందిని, వేదవికా, అలీగారు, సుమన్ గారు ప్రధాన పాత్రలో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘ఓం హరుడు’. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి హీరో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ‘ఉప్పు కప్పు రంబు’ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న మరియు విశ్వ వేమూరి సంగీతం అందిస్తుండగా ఆనంద్ మారుకుర్తి డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్ గా, రైటర్ భాను ప్రకాష్, సింగర్ సూర్య లిరిక్స్ రైటర్స్ గా పనిచేశారు.



