హీరోయిన్ దక్షా నాగర్కర్ హైదరాబాద్‌లో “వివో ఎక్స్200″ని ప్రారంభించారు

శ్వాగ్, హుషారు వంటి హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ దక్ష నగర్కర్ చేతుల మీదగా హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది.హైదరాబాద్ లోని అమీర్ పేట్ సత్యం (AAA మాల్) థియేటర్ ముందు ఉన్న N4U మొబైల్స్ షోరూంలో దక్ష ఈ మొబైల్ లాంచ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా హీరోయిన్ దక్ష మాట్లాడుతూ… ” ఈరోజు మీ ముందుకు సరికొత్త X-200 సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. Vivo X-200 సిరీస్ ఫ్లాగ్షిప్ మోడల్ వివోలో రావడం ప్రత్యేకం. అంతే కాదు, ఈ మొబైల్ దేశంలోనే తొలి 200 మెగా పిక్సెల్ కావడం మరొక ప్రత్యేకత. ZEISS APO టెలిఫోటో కెమెరా ఫీచర్ తో దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూపిస్తూ, చిన్న వాటిని కూడా 20X వరకు జూమ్ చేసి మెరుగైన క్వాలిటీతో వస్తాయి” అని తెలిపారు.

అంతే కాక N4U మొబైల్స్ యాజమాన్యం మాట్లాడుతూ ఈ మొబైల్ లోని ఫీచర్స్ ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పారు. 85mm HD టెలిఫోటో పోర్ట్రైట్ ఉన్న ఈ కెమెరా, అలాగే 135mm క్లోజ్ అప్ పోర్ట్రైట్ లో రెండు కొత్త పోర్ట్రైట్ స్టైల్స్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటి 6000mAh సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీతో ఎక్కువ సమయం పాటు ఛార్జింగ్ నిలిచేలా ఈ మొబైల్ డిజైన్ చేయబడింది అని వివరించారు. ఈ మొబైల్ దక్ష నగర్కర్ లాంచ్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అని N4U మొబైల్స్ యాజమాన్యం అయిన వివో హైదరాబాద్ సేల్స్ హెడ్ వేణు కట్ల, వివో ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ జనరల్ మేనేజర్ అతిష్ భార్గవ తమ కృతజ్ఞతలు తెలిపారు.

Previous articleవీబీ ఎంటర్టైన్మెంట్స్ పదో వార్షికోత్సవం సందర్భంగా బుల్లితెర అవార్డులను నిర్వహించిన బొప్పన విష్ణు
Next articleఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించిన రేవంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here