నందిగామ రాజకీయ చైతన్యానికి వేదిక.. దశాబ్దాలుగా అక్కడి ప్రజలూ రాజకీయంగా.. సామాజికంగా.. అర్ధికంగా అన్నింటా చైతన్యవంతులు.. ఎన్నికల సమయంలోనూ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంటారు. అదే బాటలో హిందుత్వ పరిరక్షణకు నడుం బిగించారు. నందిగామను వేదికగా మలచుకుని ధర్మపరిరక్షణకు నడుంబిగించారు. హిందువులను కలుపుకుని శాంతియుత పోరాటానికి సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొండ బిట్రగుంట వేంకటేశ్వర స్వామి, అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి రథాలను గుర్తుతెలియని ఆగంతకులు రథాలకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే కానీ ఈ ఘటన పై విచారణ జరిపి దోషులను శిక్షించాల్సింది పోయి శాంతియుతంగా నిరసన చేయడానికి వెళుతున్న హిందూ ధార్మిక సంస్థలు, జనసేన నాయకులను, వీర మహిళలను అక్రమంగా అడ్డుకోవడం, అరెస్ట్ చెయ్యడం, దాడిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చెయ్యడం “దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు” సంస్కారానికి అద్దం పట్టేలా ఉన్నది. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ముందు ముందు ప్రజలు బుద్ది చెప్తారు. ఇప్పటికైనా ఈ చర్యలకు పాల్పడిన వారిని శిక్షించి, రాష్ట్రంలో ఉండే దేవాలయాలకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చెయ్యాలని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్తంగా గాంధీ సెంటర్లో నిరసన చేస్తూ నేరుగా తహసీల్దార్ ఆఫీసుకి చేరుకొని తహసీల్దార్ కి వినతి పత్రం అధించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట మురళీ, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కొత్త సాంబశివరావు, వందేమాతరం అశోక్ హిందూ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు. Rss నందిగామ ఖండ కార్యవహక అడపా వీర వెంకట సత్యనారాయణ స్వామి , తాటి శివకృష్ణ బీజేపీ యువ మోక్ష నాయకులు, పూజారి రాజేష్ , పోలిశెట్టి కోటేశ్వరరావు, నారాయణ స్వామి, రామిరెడ్డి వీరబాబు, కరి హనుమంతు, తోట వేణు.. జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ధర్మపరిరక్షణ కొరకు నిరసన చేపట్టారు.



