కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం – నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా, స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పని చేస్తుండగా షేక్ మదీన్, రఘు కుంచె సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. మరి నేను అప్పుడు అలా అన్నాననో, లేకపోతే.. ఫస్ట్ ఫిల్మ్ దగ్గరుండి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ, వెంటనే డైరెక్టర్‌గా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ ‘దేవగుడి’ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘దేవగుడి’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మగారు పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు.. నాకు ఈ స్టోరీ తెలుసు. రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లకు నేను చెప్పేది ఒక్కటే. అందరూ కష్టపడే ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడాలి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామన్. కానీ డిజప్పాయింట్ అవకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకనిర్మాత రామకృష్ణా రెడ్డి సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం.. కంటెంట్ బాగుంటే.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను. మా రామకృష్ణా రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇలాంటి వాళ్లు సక్సెస్ అయితే.. ముందు ముందు చాలా మంచి సినిమాలు వస్తాయి. ఆయనకున్న ప్యాషన్ ఏంటనేది నాకు తెలుసు. రఘు విషయానికి వస్తే.. మేమంతా ఒకేసారి స్టార్ట్ అయినవాళ్లం. తను సంగీతంతోనే కాదు, ఆర్టిస్ట్‌గానూ మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. డిసెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు. 2013లో శ్రీకాంత్‌గారితో పుష్యమి ఫిలిం మేకర్స్ శ్రీకారం చుట్టాము. శ్రీకాంత్‌గారు ఏ నోటితో అన్నారో ఆ రోజు.. ‘భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని’.. ఆ తర్వాత నేను డైరెక్టర్‌గా మారాను. ‘దృశ్యకావ్యం’ చేశాను. అప్పుడు కూడా ఆయన అభినందించారు. ఇప్పుడు మళ్లీ మా ‘దేవగుడి’ కోసం వచ్చారు. డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎందుకంటే, ఈ సినిమాకు టాలెంటెడ్ పర్సన్స్ ఎందరో వర్క్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాను నిపుణులు, సెన్సార్ మెంబర్స్ అందరూ చూసి.. ఎంతగానో మెచ్చుకున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నాను. స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎంటైర్ టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశాం. రఘు కుంచె‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. ఆయన ఎంతగానో సహకరించారు. డీఓపీ నాకు మిత్రుడు. ఆయనే కాదు, ఎంటైర్ టీమ్ అంతా మన సినిమా అనుకుని వర్క్ చేశారు. ఇందులో నటించిన చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా చేశారు. వాళ్ల తల్లిదండ్రుల సహకారం మరిచిపోలేను. శ్రీకాంత్‌గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ.. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో మెప్పిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, డీఓపీ లక్ష్మీకాంత్ కనికే, హీరోహీరోయిన్లు మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ.. సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరారు.

అభినవ శౌర్య, నరసింహ, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం, నిర్మాత: బెల్లం రామకృష్ణా రెడ్డి
సంగీతం: ఎస్, కె మదీన్ అండ్ రఘు కుంచె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ రెడ్డి అబ్బవరం
డిఓపి: లక్ష్మీకాంత్ కనికే
ఎడిటర్: వి. నాగిరెడ్డి
పిఆర్ఓ: బి. వీరబాబు

Previous articleఅందరికీ విజయ్ దేవరకొండ, నిర్మాతలకు బంగారు కొండ – “ది గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్
Next article‘లవ్OTP’ చిత్ర రివ్యూ & రేటింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here