చైనా.. ఎంత వక్రబుద్దితో ఉంటుందనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఓ వైపు కరోనా వైరస్‌ను ప్రపంచమీద వదిలేసి విషం చిమ్మింది. మరోవైపు చిన్నదేశాలకు అప్పులిస్తూ కాలికింద ఉంచుకోవాలని ఎత్తులు వేస్తోంది. భారత్‌ను కూడా దారికి తెచ్చుకుంటే తానే నెంబర్‌వన్‌గా ఎదగాలని దురాశతో సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనా ఆర్మీ ఒక్కతూటా పేల్చితే.. భారత్ నుంచి వెయ్యితూటాలు గర్జించేందుకు సిద్ధంగా ఉన్నాయనే సంగతి మరచిపోతుంది. చైనా ఉలికిపాటుకు అసలు కారణం.. రాఫెల్ యుద్ధవిమానాలు మాత్రమే కాదు.. ఫ్రాన్స్, ఇజ్రాయేల్, అమెరికా, రష్యా వంటి దేశాలు అధునాతన ఆయుధాలు ఇచ్చేందుకు సుముఖత చూపటమే. ఇటువంటి సమయంలోనే భారత నావిదళానికి చెందిన యుద్ధనౌక చైనాకు కీలకమైన దక్షిణచైనా సముద్రజలాల్లోకి వెళ్లింది. చైనాకు సమీపంలోకి భారత్ అగ్రశ్రేణి యుద్ధనౌక రావటంతో డ్రాగన్‌కు వెక్కిళ్లు వచ్చినంత పనైందట. ఊహించని పరిణామంతో ఉలిక్కిపడిన చైనా.. తూచ్ భారత్ మాతో తొండాట ఆడుతుందంటూ గీరాలు పోయారట. ఇరు దేశాల దౌత్య సమావేశాల్లోనూ ఇదే ఆందోళన వెలిబుచ్చిందట. అయితే భారత్ మాత్రం.. రాజనీతి ప్రయోగిస్తూనే.. రణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. నావికాదళానికి కీలకమైన దక్షిణ చైనా సముద్రం, మలాకాదీవులు, ఆండమాన్‌నికోబార్ దీవుల్లో అత్యాథునిక ఆయుధాలతో పహారా పెంచింది. శత్రువు ఒక్క అడుగు వేస్తే చాలు.. తునాతునకలు చేసేంతగా ఆయుధశ్రేణిని మొహరించారట. చైనా రాయబారి వీడాంగ్ వారం క్రితమే గాల్వాన్‌లోయలో జరిగిన ఘటన దురదృష్టకరమంటూ ప్రకటించారు. కానీ.. అదే సమయంలో సరిహద్దుల్లో చైనా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టాయి. సైనికులు సరిహద్దును మార్చే ప్రయత్నం చేశారు.
చైనా కూడా భారత్ సరిహద్దుల్లో ముఖ్యంగా గాల్వాన్ లోయ వద్ద వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటుంది. పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపు జే20 విమానాలతో చక్కర్లు కొట్టింది. మరోసారి సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన చైనా ఆర్మీ నిర్మాణాలను చేపట్టడంతో ఇండియన్ సైనికులు అడ్డుకున్నారట. ఇరువురు మద్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని
ఏ మాత్రం సహించబోదని ఆర్మీచీఫ్ ప్రకటించారు. సరిహద్దుల్లో ఉన్న భద్రతా బలగాలు ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్చ ఉందని మరోసారి స్పష్టంచేశారు. దౌత్యపరమైన ఆలోచనలు చేస్తూనే.. భారత్ నిఘా మరింత పటిష్టంచేసింది. ఏ క్షణమైనా చైనాపై దూసుకెళ్లేందుకు అత్యాథునిక క్షిపణులు, శతఘ్నులు, యుద్ధట్యాంకులను మోహరించింది.
బాగుంది…జి.7 దేశ సమాఖ్యలో భారత్ చేరితే అన్ని రకాలుగా చైనా కు చెక్ పెట్టినట్లే, ఈ అమెరికా ప్రతిపాదనను తట్టుకోలేని చైనా అటు భారత్ తోను, అమెరికా తోను కయ్యానికి కాలుదువ్వుతుంది..అయితే ట్రంప్ ఈ విషయంలో గట్టి పట్టుపట్టారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వంటి దేశాల సహకారం లేనిదే చైనాను ఒంటరిగా భారత్ ఎదుర్కోవడం అంత సులువు కాదు