గాల్వాన్‌లోయలో పరిస్థితి పైకి కనిపించినంత ప్రశాంతంగా మాత్రం లేదు. భారత్-చైనా ఏ క్షణమైనా ముఖాముఖి తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. డ్రాగన్‌కంట్రీ కేవలం తన ఆయుధసామాగ్రి, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి భారత్‌ను ఢీకొట్టాలని చూస్తోంది. దీనికి పీపుల్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) ఎంత వరకూ సిద్ధంగా ఉందనేది అంచనా వేయలేకపోతుంది. ఈ ఏడాది జూన్ నుంచే మెక్‌మోహన్‌రేఖ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకూ వచ్చిన చైనా ఆర్మీ వెనక్కి వెళ్లనంటూ మొరాయించింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి వేళ కర్రలు, ఇనుప మేకులతో తయారు చేసిన ఆయుధాలతో చైనా ఆర్మీ భారత్ సైనికులపై దాడి చేసింది. వాస్తవానికి ఆ సమయంలో ఇండియన్ సైనికులు కేవలం 40-50 మంది ఉంటారని అంచనా. చైనా ఇందుకు పరిరెట్ల మందితో తలపడింది. కానీ.. ఇండియన్ సైనికుల అసమాన ధైర్యసాహసాలు.. చైనా సైనికులపై విరుచుకుపడిన తీరుతో డ్రాగన్ సైనికులు కాళ్లకు బుద్దిచెప్పారు. ఇది చైనా తమ ఆర్మీ ధైర్యం ఏ పాటిదో అర్ధం చేసుకోగలిగింది. పాక్, చైనాలతో గత యుద్ధాల్లోనూ సరిహద్దుల వద్ద ఉన్న కొద్దిపాటి సైనికులే.. ప్రత్యర్థుల సైన్యం ఎంత ఉన్నా వెన్ను చూపకుండా పోరాడారు. ప్రాణాలు పోతున్నా.. రక్తం దారలై పారుతున్నా శత్రుసైనికులను హతమార్చారు. దేశభక్తి అనేది ఇండియన్ ప్రతి నెత్తుటి బొట్టులోనూ దాగుంటుందనేది ప్రపంచానికి తెలిసిన నిజం. అందుకే.. భారత్ అణ్వాయుధాలకు భయపడదనే అభిప్రాయంతో చైనా వక్రమార్గంలో ఆలోచిస్తుంది. భారత్ పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు సాయ పడుతున్నట్టు నటిస్తూ భారత్‌కు ప్రత్యర్థులుగా మార్చుతోంది.
భారత్‌లో దృఢమైన నాయకత్వం లేకపోవటం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతూ వచ్చారు. కానీ.. 2009 నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ఏకపక్ష విజయంతో శక్తివంతమైన ప్రభుత్వంగా మారింది. కాబట్టే.. ఏడు దశాబ్దాలుగా నిర్ణయం తీసుకోలేని ఎన్నో అంశాలపై ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారత్‌లో భాగమనేది స్పష్టంచేసింది. ముస్లిం మహిళల పాలిట మహమ్మారిగా మారిన ట్రిపుల్‌తలాక్ రద్దు కూడా ధైర్యంతో కూడుకున్న నిర్ణయమే.
పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్‌స్ర్టయిక్ ద్వారా ఉగ్రవాదులను మట్టుబెట్టడం భారత్ శక్తి సామర్థ్యాలకు ఉదాహరణ. పాక్ చెరలో చిక్కిన ఇండియన్ ఎయిర్‌పోర్స్ పెలెట్ అభినందన్ కుమార్ సురక్షితంగా రాగలిగాడంటే భారత్ ఎంత రాజనీతి ఉపయోగించిందనేది అర్ధమవుతోంది. పాకిస్తాన్‌కు మిత్రదేశాలు కూడా భారతీయులకు బాసటగా ఉండేందుకు ముందుకు వస్తున్నాయి.
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలతో పై చేయి సాధించాలని చూస్తుంది. కానీ.. భారత్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాఫెల్ యుద్ధవిమానాలు దిగుమతి చేసుకోవటం, వాటిని బోర్డర్‌కు తరలించటంతో కాస్త వెనుకంజ వేస్తోంది. సముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నించినా.. భారత్-అమెరికా సంయుక్తంగా హిందూ మహాసముద్రంలో నౌకావిన్యాసాలు చేపట్టి చైనాకు గట్టి వార్నింగ్
ఇచ్చాయి. చైనా ఒక్క నౌక భారత్ వైపు కదిలితే.. మేమున్నామంటూ అమెరికా స్పష్టంచేసినట్టయింది. అండమాన్- నికోబార్ దీవుల్లోనూ భారత్ నౌకాదళం పాగా వేస్తుంది. అక్కడ భారీగా పెట్టుబడులు పెడుతూ హిందూమహాసముద్రంలో అజేయమైన శక్తిగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అండమాన్‌లో ఐఎన్ ఎస్ కొహస్సా విమానకేంద్రం, లక్షద్వీప్‌లో అగట్టి వైమానిక స్థావరాన్ని దాదాపు ఆధునికీకరించారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడ్హాఖ్ వరకూ దాదాపు 290 కి.మీ మేర రహదారి మార్గం నిర్మించనున్నారు. 2022 కల్లా దీన్ని పూర్తిచేయటం ద్వారా చైనాకు మరింత వణకు పుట్టించే వీలుంది.
3000 కిలోమీటర్ల మేర చైనాతో సరిహద్దు ఉన్న భారత్ వాయు, సముద్ర మార్గాల్లోనూ బలమైన శక్తిగా ఎదిగింది. ఇవన్నీ చైనాకు కాస్త వెనుకంజ వేయించేవే. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఇండియా, చైనా రెండూ అధికజనాభా ఉన్న దేశాలు.. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణనష్టం ఉంటుందనేది కూడా వాస్తవం. వీటన్నింటినీ మించి చైనా భయం ఒక్కటే.. యుద్ధ అనుభవం లేని పీపుల్ లిబరేషన్ ఆర్మీ భారత్ సైనికుల యుద్ధ అనుభవం. అసమాన ధైర్యసాహసాల ముందు నిలువగలరా! అనేనట.
Nice article and the way detailing this was mesmerizing ..
Excellent