సింహం పడుకుంది కదా! అని జూలు తో జడవేయకూడదు. పులి పలుకరించింది కదా! అని పక్కనే నిలబడి ఫొటో తీయించుకోకూడదు. చైనా కూడా భారత్ ఆర్మీను ఇలాగే తక్కువ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మన ప్రొడక్టే వాడుతున్నారు. మన కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదనే భ్రమల్లోనే ఉండిపోయింది. కానీ.. సింహం పంజాతో తాను ఆడుకుంటున్నానని మాత్రం గ్రహించలేకపోయింది. అప్పటికే భారత్ ఆర్మీ అంతా పూర్తిచేసింది. చైనా అధికార పత్రిక గ్లోబల్‌టైమ్స్.. ఇటీవల ఒక కథ ప్రచారం చేసింది. ఇండియాకు శీతాకాలం అంటే భయం. సైనికులు మంచుకొండల్లో యుద్ధం చేయలేరంటూ ఏవో పిచ్చిరాతలతో ఇండియాను ఎమోషన్ చేయాలని పన్నాగం పన్నింది. కానీ.. అదే సమయానికి భారత్ ఆర్మీ.. చైనా కన్నేసిన కీలక పర్వతాలను స్వాధీనం చేసుకుంది. అందనంత ఎత్తులో సైనికులు త్రివర్ణపతాకం కనిపించగానే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు చెమట పట్టినంత పనైందట. లడ్డాఖ్ సమీపంలోని ఫింగర్ 4 దగ్గరగా మొక్ఫారీ, రీసెహెన్‌లా, రెజెంగ్‌లా, మగర్‌హిల్, గురుంగ్‌హిల్ పర్వతాలను భారత్ స్వాధీనం చేసుకుంది. బలమైన సైన్యం అక్కడ మోహరించింది. భారత్ సైనికులను మానసికంగా దెబ్బతీస్తూ తాము చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నిన ప్రాంతం ఇండియన్ ఆర్మీ చేతుల్లోకి చేరటంతో చైనా మరో ఎత్తుకు సిద్ధమైంది. అవతల వైపు చైనా సైన్యం చేపట్టే కార్యక్రమాలు భారత్ తేలికగా గమనించేందుకు అనువుగా ఉండటమే చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ భయానికి అసలు కారణం.
ఇటీవల చైనా బోర్డర్‌లో భారత్‌ను కవ్వించేందుకు చైనా ఆర్మీ మాక్ వార్ డ్రిల్ చేపట్టింది. అత్యాధుని ఆయుధాలతోపాటు. యుద్ధవిమానాలు. పర్వతశ్రేణుల్లో యుద్ధరీతులు తదితర అంశాలను ప్రదర్శించారు. ఇవన్నీ భారత్‌పై కాలుదువ్వేందుకు చేస్తున్న ప్రయత్నాలుగానే ఇండియన్ ఆర్మీ భావిస్తుంది. అయితే.. చాటుగా దెబ్బతీయటంలో చైనా సైన్యం ఆరితేరి ఉన్నారు.
కాబట్టే.. ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా భారత్ ఓ అడుగు ముందుకేస్తోంది. ఎల్ ఏసీ వద్ద ఉన్న కాల్పుల ఒప్పందాన్ని కూడా రద్దుచేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశాన్ని సైన్యాన్నికి ఇచ్చింది భారత ప్రభుత్వం.
మరో్వైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాలని చూస్తోంది. ఇటీవల బోర్డర్‌లో సొరంగ మార్గాలను గుర్తించిన సైన్యం.. ఉగ్రవాదులు మకాం వేసేందుకు బంకర్లను నిర్మించుకోవటం పసిగట్టింది. అత్యాథునిక సామాగ్రితో పాకిస్తాన్ వ్యూహాత్మకంగా సైన్యం కన్నుగప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు గమనించారు. మరోవైపు హనీట్రాప్ ద్వారా భారత దళాల్లోని కీలక అధికారులపై కన్నేసి.. ముఖ్య సమాచారం రాబట్టేందుకు చైనాతో కలిపి ఎత్తులు వేస్తోంది. భారత్ భావించినట్టు.. చైనా మే నెల కంటే ముందుగానే భారత్‌పై దృష్టిసారించింది. కరోనాతో ఇండియన్లు, ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న వేళ తన పని చక్కదిద్దుకోవాలని భావించింది. కానీ.. జూన్22న భారత ఆర్మీపై దాడి.. 22 మంది సైనికుల మరణంతో ఇండియా మరింత సన్నద్ధమైంది. యుద్ధానికి కాలుదువ్వే చైనాకు ఈ సారి గట్టిగానే బుద్దిచెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. దానికి అనుగుణంగానే అంతర్జాతీయ విదేశాంగ విధానానికి పదను పెట్టింది. ఆయుధాల కొనుగోళ్లు, రఫేల్ యుద్ధవిమానాలను లడ్డాఖ్‌కు తరలించటం వంటి కీలకమైన నిర్ణయాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే పూర్తిచేయగలిగింది.
చక్కని వివరణ అమెరికా ఎన్నికల గురించి ఇచ్చారు బాగుంది విశ్వేశ్వరరావు….. పరిణతి చెందిన విశ్లేషణ