చైనాతో తాడోపేడో ఇండియ‌న్ ఆర్మీ రెడీ !

ఒక్క‌ఛాన్స్‌… ఇండియ‌న్ ఆర్మీలో ఏ సైనికుడిని ప‌లుక‌రించినా వినిపించే మాట‌. ఎన్నో ఏళ్ల నుంచి ఇటు చైనా.. అటు పాకిస్తాన్ దొంగ‌దెబ్బ తీస్తూ.. వేలాది మంది సైనికుల‌ను బ‌లితీసుకున్నాయి. ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగకుండా కుతంత్రాలు చేయ‌టం వాటి నైజం. ద‌శాబ్దాలుగా సంకీర్ణ ప్ర‌భుత్వాలు ఉండ‌టంతో భార‌త్ కూడా ధీటుగా ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయింది. ఏదైనా క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. ప్రాంతీయ‌పార్టీల ఎంపీలు తూచ్ అంటూ మోకాల‌డ్డేవారు. ఫ‌లితంగా చాలాసార్లు బోర్డ‌ర్‌లో సైనికుల ఉత్సాహాన్ని నీరుగార్చాల్సి వ‌చ్చేందంటు నిపుణులు విశ్లేషిస్తుంటారు. న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టాక ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. ఎన్డీఏ కూట‌మిలో మిత్ర‌ప‌క్షాలు ఔనన్నా. కాద‌న్నా.. మోదీ తీవ్ర నిర్ణ‌యం తీసుకునేందుకు వెనుకాడ‌ర‌నేది అర్ధ‌మ‌వుతోంది. తాజాగా చైనాతో స‌రిహ‌ద్దు వివాదంపై విదేశాంగ విధానంతో చాణ‌క్య‌త ప్ర‌ద‌ర్శించిన మోదీ.. స‌మ‌రానికి సై అంటే.. త‌గ్గే ప్ర‌స‌క్తేలేదంటూ బోర్డ‌ర్ కెళ్లి మ‌రీ సైనికుల భుజం త‌ట్టిధైర్యం నింపిన ధీశాలి. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ‌విమానాలు, ఇజ్రాయేల్ నుంచి వ‌చ్చిన రాడార్ వ్య‌వ‌స్థ‌.. ర‌ష్యా నుంచి యుద్ధ‌ట్యాంకులు.. అమెరికా యుద్ధ‌నౌక‌లు.. ఇలా ప్ర‌తి మిత్ర‌దేశం.. భార‌త్‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాయి. చైనా కుటిల‌త్వానికి స‌మాధానం ఇచ్చేందుకు భార‌త్ వెంట మేమున్నామంటూ చిన్న‌చిన్న దేశాలు కూడా ప్ర‌క‌టిస్తున్నాయి.

చైనా-ఇండియా బోర్డ‌ర్ వ‌ద్ద ఫాంగాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ప‌రిస్థితులు గంబీరంగా ఉన్నాయి. పార్ల‌మెంట్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ‌నాథ్‌సింగ్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండ‌టం మిన‌హా మ‌రో మార్గం లేదంటూ చెప్పిన‌ట్టుగానే రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది భార‌తీయ సైనికులు స‌రిహ‌ద్దులకు చేరారు. సుమారు 4,700 కి.మీ పొడ‌వునా బీఎస్ ఎఫ్‌, సీఆర్ పీఫ్ బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్నాయి. రాడార్ వ్య‌వ‌స్థను కూడా మ‌రింత ప‌టిష్ఠంగా త‌యారు చేశారు. ఏ క్ష‌ణంలో పిలుపువ‌చ్చినా పైకి లేచేందుకు సుమారు 100 యుద్ధ‌విమానాలు రెఢీగా ఉంచారు. ఏక‌కాలంలో పాకిస్తాన్‌, చైనాతో యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలాంటి వ్యూహం అనుస‌రించాల‌నే దానిపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సుమారు 20-30 రోజుల వ‌ర‌కూ యుద్ధానికి స‌రిప‌డినంత ఆయుధ‌సామాగ్రి, ఆహారం, గాయ‌ప‌డిన సైనికుల‌కు చికిత్స అందించేందుకు ఆర్మీ అంబులెన్స్‌లు, ర‌క్త‌పు నిల్వ‌లు అన్నీ సిద్ధంగా ఉంచుతున్నార‌ట‌. ఇదంతా కేవ‌లం 500 మీట‌ర్ల దూరంల ఎదురెదురుగా నిలుచున్న చైనా-ఇండియా సైనికుల ప‌రిస్థితి.

సెప్టెంబ‌రు 7వ తేదీ ఇరువ‌ర్గాలు ఎదురెదురుగా నిలుచుని గాల్లోకి దాదాపు 500 రౌండ్ల వ‌ర‌కూ కాల్పులు జ‌రుపుకున్నార‌ట‌. ఇటువంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జరుగుతూనే ఉన్నా మున్ముందు మాత్రం మ‌రింత సీరియ‌స్ వాతారణం నెల‌కొనే ప‌రిస్థితులు ఉన్నాయ‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. ఏమైనా.. చైనాతో తాడోపేడో తేల్చుకోవ‌టం ద్వారా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని మోదీ స‌ర్కార్ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యంలో భార‌త్ ప్ర‌జ‌ల‌కు మొత్తం .. సైన్యం వెంట‌నే ఉందంటూ పునురుద్ఘాటించారు.

Previous articleకోడెల‌ను గ‌ర్తుచేసుకున్న బాల‌య్య‌
Next article135 కోట్ల ఇండియ‌న్స్‌కు క‌రోనా వ్యాక్సిన్ ఖ‌ర్చెంతో తెలుసా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here