ఎక్స్‌పీరియన్ – ఇన్వెస్ట్ ఇండియా క్రెడిట్ ఎకోసిస్టమ్ రివ్యూ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే అధిక వేగంతో ఎదగనున్న భారత కన్సూమర్ క్రెడిట్ మార్కెట్
• భారతదేశ మధ్య తరగతి వర్గంలో సంపన్నుల ఎదుగుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ప్రగతి కారణంగా కొనుగోలుదారులు ఖర్చు చేసే విధానాల్లో మార్పు చోటుచేసుకుంటూ భారత్‌లో వినియోగవృద్ధిని ముందుకు నడిపిస్తుంది.
• సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవడం ద్వారా కొత్త ఆర్థిక సాధనాలకు ఆమోదం ఏర్పడింది. దీంతో భారతీయ రుణ మార్కెట్ స్వీయ సృష్టి, స్వీయ సుస్థిరత దిశగా సాగుతుండటంతో వినియోగదారుల రుణవిలువ పెరుగుతోంది, దీంతో సంప్రదాయ రుణదాతలు తమ రిస్క్‌ను పెంచుకుంటున్నారు.
Hyderabad, జూన్ 16, 2021: మహమ్మారి ఉన్నప్పటికీ భారత రుణవాతవరణం హుషారుగానే ఉందని తాజా నివేదిక తెలుపుతోంది. “భారత దేశ రుణ వాతావరణ వ్యవస్థ సమీక్ష” అన్న ఈ నివేదికను ప్రపంచంలోనే పేరుగాంచిన అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ ఎక్స్‌పీరియన్, పెట్టుబడులు, సదుపాయాలకు సంబంధించిన జాతీయ ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి.
“భారత దేశ రుణ వాతావరణ వ్యవస్థ సమీక్ష” అన్న ఈ నివేదిక రుణ రంగంలో అనేక కీలక పోకడలను ముఖ్యంగా భారత వినియోగ రుణ మార్కెట్ ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలతో పోల్చితే వేగంగా పెరుగుతోందనే విషయాన్ని తెలియజేసింది. భారతదేశంలో పెరుగుతున్న సంపన్న మధ్యతరగతి శ్రేణి, వ్యక్తిగత వినియోగం, గ్రామీణ జనాభాలో పెరుగుదలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం దీన్ని ముందుకు నడిపిస్తోందని నివేదిక వివరించింది. మార్కెట్‌లో బ్యాంకింగ్ సదుపాయాలు పొందని వారు, అణగారిన జనాభాలో ఉన్న అంతరాలను గుర్తిస్తూ ఆ శ్రేణిలోని వినియోగదారుల ఆర్థిక అవసరాలు తీర్చుతు ఆ రుణ స్వరూపాన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ సంస్థలు మార్చేశాయని నివేదిక తెలిపింది. మహమ్మారి సమయంలో నియంత్రణ సంస్థలు భారత రుణ వాతావరణ వ్యవస్థకు చేయూత ఇచ్చాయని నివేదిక వెల్లడించింది.
మార్చి 2017 నుంచి ఫిబ్రవరి 2021 వరకు భారత రుణ వాతావరణ వ్యవస్థ సమాచారాన్ని ఈ నివేదిక సేకరించింది. మూలపు పోకడల్లో క్రమబద్ధమైన, స్థిరమైన మెరుగుదలతో భారతీయ మార్కెట్లు V-ఆకారపు రికవరీ చూస్తున్నాయని ఈ నివేదిక విశ్లేషించింది. అక్టోబర్ 2020లో కొత్త సోర్సింగ్ అన్నది కొవిడ్-19 ముందు పరిస్థితికి వచ్చిందని, కాని సొర్సింగ్ మొత్తాలు కొవిడ్-19 రెండో దశ, తదనంతర లాక్‌డౌన్ల కారణంగా జనవరి 2021 నుంచి క్షీణించింది.
అన్ని రకాల అసురక్షిత రుణ ఉత్పత్తులకు సంబంధించిన విశేషమైన మెరుగుదల కనిపించింది. వ్యక్తిగత రుణాల రీకవరి అన్నది తక్కువ శ్రేణి (<రూ.1 లక్షలోపు) అలాగే ఉన్నత శ్రేణి (>రూ.5 లక్షల్లోపు) ఉన్నతంగా ఉంది. మరో వైపు అధిక శ్రేణి రుణ పరిమాణాల్లోనూ మెరుగుదల స్థిరంగా ఉంది. రుణ పోర్టుఫోలియో అన్నది హుషారుగా ఉంది. ఫిబ్రవరి 2021లో ముఖ్యమైన ఉత్పత్తుల వార్షిక వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. అయితే మార్చి 2020తో 13 శాతంతో పోల్చితే ఇది తక్కువ. అన్ని ఉత్పత్తులకు సంబంధించి పెరుగుదల మందగించింది, కాని, సురక్షిత ఉత్పత్తుల వార్షిక వృద్ధి రేటుతో పోల్చితే అసురక్షిత ఉత్పత్తులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
ఎక్స్‌పీరియన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ ధావన్ మాట్లాడుతూ, “ గడిచిన ఐదేళ్లలో భారతీయ జనాభా పోకడల్లో గణనీయమై మార్పులు వచ్చాయి. మాస్ మార్కెట్‌లో సహస్రాబ్ది యువత కీలక చోదక శక్తిగా మారడంతో ఇన్నాళ్లు అందిపుచ్చుకోని సెమి-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగతత్వం అన్నది బాగా పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం బాగా పెరగడంతో కొత్త ఆర్థిక సాధనాలకు ఆమోదం ఏర్పడుతోంది. ఈ మార్పు వలన బాగా లబ్ది పొందుతూ స్వీయ సృష్టి, స్వీయ సుస్థిరత దిశగా రుణమార్కెట్ ఎదుగుతోంది. రుణవిలువలు విస్తరిస్తుండటంతో ఈ పోకడలకు తగ్గట్టుగా సంప్రదాయ రుణదాతలు తమ రిస్క్ తీసుకునే తత్వాన్ని పెంచుకుంటున్నారు. రుణ మదింపు వ్యాపారంలో ఉన్నవారు తెలివైన రుణ నిర్ణయాలు తీసుకునేలా, తమతో పాటు తమ కస్టమర్లను మోసాల బారి నుంచి రక్షించేలా చూస్తు సృజనాత్మక పరిష్కారాలు అందిస్తూ ఈ మార్పులో కీలక శక్తిగా అగ్రస్థానంలో ఎక్స్‌పీరియన్ నిలుస్తోంది” అని అన్నారు.
ఈ సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ దీపక్ బాగ్లా మాట్లాడుతూ, “ఆర్థిక సమిష్టితత్వంలో భారత్ పెద్ద అడుగులు వేస్తోంది. సంపన్న మధ్య తరగతి పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల-వినియోగ వ్యయంలో మార్పులకు దారితీస్తు భారతీయ వినియోగ వృద్ధికి కారణమవుతున్నాయి. అంతే కాదు వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రుణ వాతావరణ వ్యవస్థ వృద్ధిని మరింత వేగవంతం చేశాయి. ప్రస్తుతమున్న ఈ అనూహ్య పరిస్థితుల్లో రుణ రంగానికి సంబంధించి విశ్వసనీయమైన, ఆచరణాత్మక సమాచారాన్ని అందించేందుకు ఈ నివేదిక కృషి చేస్తోంది. భారతదీయ రుణ వ్యవస్థలో మరింత మెరుగుదల సాధించేందుకు ఎక్స్‌పీరియన్, ఇన్వెస్ట్ ఇండియా ఉమ్మడి నిబద్ధతను ఈ నివేదిక తెలియజేస్తుంది.
ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో దీపక్ బాగ్లాతో పాటు ఆర్థిక సేవల సంయుక్త కార్యదర్శి శ్రీ సౌరభ్ మిశ్రా, డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేంద్ర రత్నూ పాల్గొన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు:
రుణ ఆధారిత వినియోగానికి డిమాండ్:
ఊహించని వేగంతో భారత ఆర్థిక రంగం ఎదుగుతుండటంతో దేశంలో రుణాలకు గడిచిన కొన్నేళ్లుగా స్థిరమైన డిమాండ్ కనిపిస్తోంది. సంపన్న మధ్య తరగతి పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల-వినియోగ వ్యయంలో మార్పులకు దారితీస్తు భారతీయ వినియోగ వృద్ధికి కారణమవుతున్నాయి. భారతదేశపు దేశీయ రుణ వృద్ధి మార్చి 2000 నుంచి మార్చి 2021 మధ్య కాలంలో ప్రధానంగా రిటెయిల్ రుణాలు, క్రెడిట్ కార్డుల వ్యాప్తి కారణంగా సగటున 15.1 శాతంగా నిలిచింది. ప్రతీ నెలా కొత్తగా 22 మిలియన్ భారతీయ వినియోగదారులు కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటడంతో భారతీయ వినియోగ రుణ మార్కెట్ అంతర్జాతీయంగా మిగిలిన ప్రధాన ఆర్థికవ్యవస్థలతో పోల్చితే ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది.
సగటు భారతీయుడి కొనుగోలు శక్తి పెరగడం:
బ్రెజిల్ వంటి దేశంతో పోల్చితే భారతదేశంలో వినియోగ వ్యయం రెట్టింపు కంటే ఎక్కువుంటుంది. గడిచిన ఐదేళ్లుగా వ్యక్తిగత తుది వినియోగ వ్యయమన్నది స్థిరంగా పెరుగుతూ 2020 నాటికి రూ. 123.1 మిలియన్లకు (అమెరికన్ డాలర్లు 1.70మిలియన్లు) చేరింది. గడిచిన ఐదేళ్లలో భారతీయ కుటుంబాల రుణాలు ఏటా 13 శాతం వార్షిక రేటుతో పెరిగింది.
వినియోగ జనాభా ప్రొఫైల్‌లో మార్పు:
యువత అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి, పని వయస్సు పౌరులు రోజు కొత్తగా వస్తూనే ఉన్నారు. ఈ సహస్రాబ్ది కొత్త తరంతో పాటు జెన్-Z కు చదువు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చక్కని ఆదాయాలు ఉండటంతో పొదుపు మంత్రాన్ని పక్కన పెట్టి వినియోగ వ్యయాన్ని పెంచుకుంటున్నారు. ఆదాయ స్థాయికి తగినట్టుగా వినియోగదారులు జీవనశైలి ఉత్పత్తులు, వినియోగ వస్తువులు, ఆభరణాల వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారతదేశంలో సంపన్నులు పెరుగుతుండటంతో దేశీయ వినియోగం గడిచిన దశాబ్దంలో 3.5 రెట్లు అంటే రూ.31 ట్రిలియన్ల (అమెరికన్ డాలర్లు 0.42 ట్రిలియన్లు) నుంచి రూ.110 ట్రిలియన్లకు (అమెరికన్ డాలర్లు 1.50 ట్రిలియన్లు) పెరిగింది.
మారుతున్న వినియోగదారుల స్వరూపం – పెరుగుతున్న ఫిన్‌టెక్ పాత్ర:
వినియోగదారులు, వ్యాపారులు రెండింటికి సేవలందిస్తూ వేగంగా ఎదుగుతున్న రంగం ఫిన్‌టెక్. దీన్ని ఈ దశాబ్దపు ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు భారతదేశపు ఆర్థిక సేవల రంగాన్ని బ్యాంకులు ప్రభావితం చేసేవి, కాని ఇప్పుడు ఆ రంగంలోకి ఫిన్‌టెక్స్ ప్రవేశించి క్రెడిట్ హిస్టరీ లేదని లేదా కొల్లెటరల్ లేదని బ్యాంకుల చేత తిరస్కరణగు గురైన పట్టణ, గ్రామీణ ప్రాంతాల కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని తమదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. సరికొత్త సృజనాత్మకత ఉత్పత్తులను అందించడంతో పాటు ఆర్థిక ఉత్పత్తులను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత పరిమాణంలోనైనా సులభంగా పొందేందుకు వీలు కల్పిస్తూ “సాచెట్ ప్యాకేజింగ్” విధానాన్ని తీసుకువచ్చాయి. పెరుగుతున్న కస్టమర్ల అంచనాలు, ఈ-కామర్స్ రాక, స్మార్ట్‌ఫోన్ల వ్యాప్తి కారణంగా గడిచిన కొన్నేళ్లుగా భారత ఫిన్‌టెక్ వాతావరణ వ్యవస్థ అనేక రెట్లు పెరిగింది.
ఎదుగుదల పోకడలు:
1. సురక్షిత ఉత్పత్తులతో పోల్చితే అసురక్షిత ఉత్పత్తుల వాటా రుణ పుస్తకాల్లో పెరిగి సీఎజీఆర్‌లో 38 శాతంగా నిలిచింది. అదే సురక్షిత ఉత్పత్తుల వాటా 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎజీఆర్‌లో 17 శాతం పెరిగింది.
2. కొనుగోలుతత్వం పెరగడంతో పాటు ఆర్థిక సంస్థలు పెరగడం వలన ఆర్థిక సంవత్సరం 2018 నుంచి ఆర్థిక సంవత్సరం 2020 మధ్య కాలంలో మంజూరు చేసిన రుణాలు మొత్తంగా 39 శాతం వృద్ధి రేటును చూశాయి. వీటిలో అసురక్షిత రుణాలదే పెద్ద వాటా, అవి సీఎజీఆర్‌లో 49 శాతంతో ఆకర్షణీయ వృద్ధిని చూశాయి.
3. 3వ, 4వ శ్రేణి మార్కెట్లకు కూడా రుణ మార్కెట్ విస్తరణ పెరుగుతోంది. ఈ మార్కెట్లలో టూ-వీలర్లు, ప్రారంభ స్థాయి కార్లు, అందుబాటు గృహల వంటి వాటి ఉత్పత్తుల గిరాకీ బాగా కనిపిస్తోంది. అదే సమయంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు చేసే జనాభా ఉండే కారణంగా అవి ఇప్పటికి పెద్ద రుణ మార్కెట్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
4. 2020-21 ద్వితీయ త్రైమాసికంలో 7.5 శాతం సంకోచంతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా వేగంగాఎగిసిపడింది. ఒక V-ఆకారపు రికవరీ అన్నది ఏప్రిల్ 2020లో మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అత్యధిక ప్రగతిని నమోదు చేసే సంవత్సరాల్లో ఒకటిగా నిలవబోతోంది.
5. వారసత్వ బ్యాంకింగ్ వ్యవస్థలు సాంకేతికత ఆధారంగా వినూత్న రుణ-వ్యవస్థలకు దారి చూపుతుండటంతో అవి జనాలకు వారి అవసరాలకు తగిన ఆర్థిక ఉత్పత్తులు, సేవలు అందిస్తున్నాయి.
6. గ్రామీణ భారతదేశ ఆదాయాల్లో చోటుచేసుకుంటున్న వృద్ధి సూక్ష్మబీమా రంగంలో డిమాండ్ పెంచుతోంది.