ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందనగానే.. ఊరూ..వాడా వాల్‌పోస్టర్లు వెలిసేవి. అప్పట్లో అదే పేద్ద పండగ. వారం పది రోజుల ముందు నుంచే పోస్టర్ల వద్ద నానా హంగామా ఉండేది. అదే సమయంలో పోట్లాటలు కూడా సాగేవి. అయితే.. అవన్నీ పోస్టర్లు చింపేయటమో.. మరీ కడుపుమండితే పేడ విసరటమో చేసి తమలో తాము తృప్తిపడేవారు. అవతలి వారిని ఉడికించామనే ఆనందంతో ప్రశాంతంగా నిద్రపోయేవారు. అంతా గప్‌చుప్‌గా జరిగేది.. బ్లాక్అండ్ వైట్ రోజులు కాబట్టి అదంతా గోప్యతగా సాగేది. మరి ఇది డిజిటల్ యుగం.. కూరలమ్ముకునేవాడి నుంచి.. కార్పోరేట్ కంపెనీ సీఈఓ వరకూ అందరి చేతిలో మొబైల్ ఉందాయే.. ధరలు తగ్గించి.. అలవాటు చేసి బానిసలుగా మార్చే నెట్‌వర్క్ సంస్థలు ఉండనే ఉన్నాయి. దీంతో ఉచిత డేటాతో చెలరేగటమే.ఇది సినీ, రాజకీయనేతలకు కాస్త తలనొప్పిగానే మారింది. అవతలి వాడు.. ఫలానా అని తెలిస్తే.. చాల కుమ్మేయ్ అంటూ.. సోషల్‌మీడియాలో దాడులే కాదు.. ఏకంగా యుద్ధాలకే తెగబడుతున్నారు. ఇదే.. ఇప్పుడు.. పాపులారిటీ ఉన్న జగన్, పవన్‌లకు తలనొప్పిగా మారింది. ఒకరు.. గెలిస్తే.. మరొకరు ఓడారు. ఇంతే.. ఇద్దరి అభిమానులు రోడ్లమీదకు రావటం లేదుకానీ.. సోషల్ మీడియాలో బూతుల పంచాంగమే విప్పుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు.. జగన్ మద్యం పాలసీపై విమర్శించాడనే అక్కసుతో చంపేశారంటోంది ప్రతిపక్షం. తూర్పుగోదావరి జిల్లాలోనూ జగన్ అభిమానులెవరో దళిత కుర్రాడికి శిరోముండనం చేశారంటూ అదో సంచలనం రేకెత్తించారు. రాష్ట్రపతి వద్ద వరకూ ఫిర్యాదు చేరింది. తాజాగా విశాఖలో పవన్ అభిమాని నూతన్‌నాయుడు ఎవరో దళితయువకుడికి శిరోముండనం చేయించాడంట. అభిమానులు చేసే తప్పిదాలకు.. అడ్డగోలు వ్యవహారాలకు నాయకులూ కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడిది దళితుల సంబందించిన అంశం కావటంతో అటు.. జగన్.. ఇటు పవన్ ఇద్దరికీ తలనొప్పి మరింత పెరిగిందట.



