నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన కీర్తి శేషులు శ్రీ షేక్ పెద్ద బాజీ గారు అనారోగ్య కారణాలతో ఇటీవల అకాల మరణం చెందిన విషయం విదితమే. వారు నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా సేవలందించారు. గడచిన నెలలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా కీసర గ్రామం విచ్చేసి బాజీ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెడుతూ ఈ రోజు తెనాలి పట్టణం లో పార్టీ కార్యాలయం లో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రేడ్డి రామకృష్ణ గారి అధ్యక్షతన బాజీ గారి కుటుంబ సభ్యులకు రూ.1,00,000/- చెక్కును వారికి అందజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు. అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడిన పార్టీ క్రియాశీలక సభ్యుడు రామిశెట్టి రామకృష్ణ కు కూడా నిన్న (అనగా సోమవారం). మంగళగిరి పార్టీ కార్యాలయం లో రూ. 50,000/- చెక్కును అందజేసి పార్టీ కార్యకర్తల పట్ల పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత అని తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో నందిగామ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాటి శివకృష్ణ, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్, వీరులపాడు మండల అధ్యక్షుడు బేతపూడి జయరాజు నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు కుడుపుగంటి రామరావు, చందర్లపాడు మండల అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్ లు పాల్గొన్నారు. నందిగామ నియోజవర్గ జనసైనికుల పట్ల పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న ప్రేమ వాత్సల్యానికి నియోజకవర్గ కన్వీనర్(వర్కింగ్) పూజారి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు నందిగామ నియోజకవర్గ పార్టీ కార్యలయం. *ఇట్లు,*