జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు. తిరుపత ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కొవిడ్ 19 లక్షణాలతో వైద్యపరీక్ష చేయించుకున్నారు. మొదటిసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది.మరో మూడు రోజుల తరువాత చేసిన అదే పరీక్షలో పాజిటివ్‌గా గుర్తించారు. ఫామ్‌హౌస్ లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్యచికిత్సలు పొందారు. ఇటీవల నెగిటివ్ రిపోర్టు వచ్చినా కొవిడ్ వల్ల తలెత్తే నీరసం, నిస్సత్తువతో కాస్త ఇబ్బంది పడ్డారు. తాజాగా వైద్యుల పరీక్షల్లో పవన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నట్టు ప్రకటించారు. తన కోసం ప్రార్థించిన, పూజలు చేసిన అభిమానులు, జనసైనికులకు పవర్‌స్టార్ కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత వరకూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేయాలని సూచించారు. మాస్క్‌లుధరించటం, వ్యక్తిగత దూరం పాటించటం వంటివి చేయాలని కోరారు. తమ అభిమాన హీరో, నాయకుడు పూర్తిగా కోలుకున్నట్టు తెలియగానే అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.