తెలుగు జాతి ఉన్నంత వరకూ.. అమరజీవి అందరి గుండెల్లో ఉంటారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చే సిన థన్యజీవి. తెలుగు ప్రజల ఐక్యతకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు తన ఆత్మ బలిదానం తో అమరుడైన “శ్రీ అమరజీవి పొట్టి శ్రీ రాములు” గారికి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యం లో ఆ మహనీయుడిని స్మరించుకుంటూ స్థానిక గాంధీ సెంటర్ నందు నివాళి కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి తోట మురళి కృష్ణ , ప్రధాన కార్యదర్శి కొప్పెర కోటేశ్వర రావు , నరేంద్ర కుమార్, ప్రసాద్, హనుమంతరావు , మీసాల తిరుపతి రావు , వీరబాబు, పూజారి రాజేష్ హాజరు అయ్యారు.



