మొన్న తమిళనాడు ఎన్నికలు మరోసారి సినీ హీరోల రాజకీయాలను చర్చకు తీసుకొచ్చాయి. అభిమానులు కోట్లల్లో ఉన్న ఓట్లు మాత్రం డిపాజిట్లు దక్కనంత దక్కించుకోవటం వెనుక హీరోల తప్పిదం ఉందా! తెరమీద చప్పట్లు కొట్టే జనం ఎందుకిలా బ్యాలెట్ బాక్సు వద్ద ఘోరంగా దెబ్బతీస్తున్నారనేది అంతుబట్టని ప్రశ్నగామానే మారింది. అయితే ఇక్కడ మరో విషయం ఎన్నిసార్లు ఓడినా.. గెలిచేందుకు ఒక మార్గం ఉందని ఏఐడీఎంకే నేత స్టాలిన్ గెలుపు నిరూపించింది. ఎంత పేరున్నా జనం నమ్మకాన్ని కోల్పోతే అంతే సంగతులంటూ కమల్‌హాసన్ ఓటమి చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఏపీలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కూడా అదే గాటిన కట్టేయవచ్చా! అనేది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. కమల్ పార్టీ పెట్టినపుడు తాను పవన్ లాంటి వాడిని కాదంటూ ఏవో కారుకూతలు కూయటంపై పవన్ అభిమానులు మండిపడ్డారు. ఇప్పుడు అదే కమల్ ఘోరంగా ఓడాడు. సినీ తారలు ఖుష్బూ, మన్సూర్ అలీఖాన్ కూడా అదే ఓటమితో అవమానపడ్డారు. అది తమిళనాడు.. అక్కడ డీఎంకే, అన్నా డీఎంకే ఈ రెండు పార్టీ లదే హవా. రజనీకాంత్ పోటీ చేసినా స్టాలిన్ దెబ్బకు ఊహించని పరాభవం చవిచూడాల్సి వచ్చేది. అదృష్టవశాత్తూ అధికరక్తపోటు రజనీను పరవుపోకుండా కాపాడగలిగింది.
పవన్ కళ్యాణ్‌కు కమల్ హాసన్‌కు చాలా తేడా ఉంది. పవన్ ఏపీలో కేవలం హీరోగానే కాదు.. సామాజిక సేవా కార్యకర్తగా కోట్లాది మందికి స్పూర్తి. నమ్మకం, నీతి , నిజాయతీలకు ఆదర్శం. 2019 ఎన్నికల్లో గాజువాక, బీమవరం రెండుచోట్ల ఓడినా జనంలోనే ఉన్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్న ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ బలం చూపారు జనసైనికులు. కొన్నిసీట్లను గెలుచుకోవటం ద్వారా పల్లెల్లోనూ తాము పాగా వేశామని నిరూపించారు. జగన్ ఎంత బలమైన సీఎం అయినా.. వైసీపీ మరెంతటి శక్తివంతమైన పార్టీగా మారినా.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలను వైసీపీకు ధీటుగా ఏపీ ప్రజలు భావించట్లేదు. వైసీపీను ధీటుగా ఎదుర్కోనే సత్తా జనసేనదే అనే నమ్మకం జనంలో ఉంది. దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఆర్ధికంగా బలోపేతమయ్యేందుకు సినిమాలు మొదలుపెట్టారు. 2024 ఎన్నికల నాటికి పార్టీను క్యాడర్ పరంగానే గాకుండా ఫైనాన్షియల్‌గా బలోపేతం చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఇవేమీ లేకుండా కేవలం గ్లామర్‌ను మాత్రమే నమ్ముకున్న కమల్ హాసన్ ఓటమి తరువాత మళ్లీ జనం
మధ్యకు వెళ్లిన దాఖలాల్లేవు. తన స్పందన ఏమిటనేది కూడా వెలిబుచ్చలేదు. ఈ లెక్కన ఎటుచూసినా కమల్‌హాసన్ నటుడు మాత్రమే.. కానీ పవన్ నటుడు మాత్రమే కాదు.. బలమైన నాయకుడు కూడా అంటున్నారు జనసైనికులు.