ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం లో స్ట్రీమ్ అవుతున్న ‘కన్యక’

విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైన చంపేసారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలోని ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది… కన్యక ఏమైంది వచ్చిన అమ్మాయి ఎవరు చివరి వరకు అసలు ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో నడిచే ఈ సినిమా ని నకరికల్లు ప్రాంత వాసులైన నిర్మాతలు KV అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు.

వారు మాట్లాడుతు మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్ అని కుటుంబం మొత్తం కలిసి చూడగలగిన చక్కని చిత్రం అని పేర్కొన్నారు.

దర్శకుడు రాఘవ మాట్లాడుతు ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించిన అమ్మవారు క్షమించదు శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని సినిమా చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసామని షూటింగ్ కు నకరికల్లు మరియు చాగంటి వారి పాలెం వాసులు మాకు ఎంతో సహకరించారని చెప్పారు. మా ట్రైలర్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో శివరామరాజు, జబర్ధస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి, PVL వరప్రసాదరావు, సర్కార్, ఫణిసూరి, KV అమర్, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, సాలిగ్రామం, RMP వెంకటశేషయ్య, మమత, శిరీష, విజయనీరు కొండ,రేవతి తదితరులు నటించారు.

మాటలు : వెంకట్. T
పాటలు : విజయేంద్ర చేలో
సింగర్ : పూర్ణిమ
సంగీతం : అర్జున్
నేపథ్య సంగీతం : జి.ఆర్. నరేన్
మేకప్రె: డ్డప్పరెడ్డి
డి.ఓ.పి : రాము, తరుణ్
కొరియోగ్రఫి : లక్కి శ్యామ్
సౌండ్ & మిక్సింగ్ : పరుశురామ్
ఎడిటర్ & కలరిస్ట్ : సుభాన్.బి
మేనేజర్ : సర్కార్
డైరక్షన్ డిపార్ట్మెంట్ : సిద్దు, దిలీప్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : D.K.బోయపాటి
ప్రొడ్యూసర్స్ : KV అమర లింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు
రచన-దర్శకత్వం : రాఘవ తిరువాయిపాటి

Previous articleTFCC లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ను కలిగి ఉంది
Next articleఆంధ్ర ప్రదేశ్ వరద బాధితులకు నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన్ రూప విరాళం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here