అబ్బే కాపులకు కులపిచ్చి.. వాళ్లకు యూనిటీ లేదు. . వీళ్లంతా ఏవరో ఒకరికి ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకుని బతుకుతుంటారు. లేకపోతే.. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వంగవీటి రంగా ఒక్కడే నాయకుడు అని బతికేస్తున్నారు. చదువుకోరు.. ఉద్యోగాలు చేయలేరు. ఇదీ ఇప్పటి వరకూ కాపు అనే సామాజికవర్గంపై ఉన్న విమర్శలు.. రాజకీయంగా ఎదిగేందుకు కొందరు కాపు నేతల వికృత చేష్టలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది కాపులు భరించిన.. భరిస్తోన్న అవమానాలు. కానీ.. క్రమంగా కాపు వర్గంలోనూ మార్పు వస్తుంది. కులాలకు అతీతంగా అందర్నీ కలుపుకుని పోవటం.. ఓపిక, సహనంతో ఎదురయ్యే ఇబ్బందులను భరించటం.. లక్ష్యం చేరేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సంపాదించుకోవటం వంటివి అలవరచుకుంటున్నారు.
విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకునేంతగా ఎదిగారు. ఇక మిగిలింది.. రాజకీయం.. 1989లో కాంగ్రెస్ ఏపీలో ఖతం అనుకున్నపుడు వంగవీటి రంగా హత్య మళ్లీ కాంగ్రెస్‌కు జీవం పోసింది. అటువంటి ప్రభావం చూపిన కాపులు.. 2021లో మరోసారి తమ సత్తాను పంచాయతీ ఎన్నికల ద్వారా ఏపీ రాజకీయపార్టీలకు రుచిచూపారు. ఇది శాంపిల్ మాత్రమే.. అసలు 2024 నాటికి మిగిలే ఉందనే సంకేతాలు పంపారు.
పవన్ కళ్యాణ్ జనసేనతో వచ్చినపుడు తనకు కుల, మతాలతో సంబంధం లేదని.. తన సిద్ధాంతాలకు అనుకూలంగా నడిచే వారు ఎవరైనా తనతో రావచ్చని.. అయితే 25 ఏళ్లపాటు గెలుపోటములకు అతీతంగా ఉండాలంటూ ముందుగానే హింట్ ఇచ్చారు. అయినా.. ప్రత్యర్థులు.. పవన్‌కు కుల ముద్ర వేసి.. జనసేనను కేవలం ఒకే కులానికి చెందిన పార్టీగా విపరీతమైన ప్రచారం చేశారు. దీన్ని పవన్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారనేది తెలియదు కానీ.. కాపు సామాజికవర్గంలోని యువత, మహిళలు మాత్రం పవన్ వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వాలు కాపులకు అందించే సంక్షేమ పథకాలు దూరం చేస్తాయని హెచ్చరించినా రైతు కుటుంబాల నుంచి వచ్చిన తాము అవసరమైతే మరోసారి నాగలి పట్టుకునేందుకు సిద్ధమంటూ తెగించేంత వరకూ చేరారు. ఇది మున్ముందు రాజకీయాల్లో పెనుమార్పులకు కారణం అవుతుందనేది విశ్లేషకులు అంచనా. నాటి మంత్రి రిజర్వేషన్లకు ఆధ్యుడు
శివశంకర్ ఆశించినట్టుగా .. వంగవీటి కాపునాడు ఏర్పాటు చేయటం వెనుక కారణమైన.. కాపులు, దళితులు ఏకం కావాలనే ఆకాంక్ష.. మున్ముందు తీరుతుందనే సంకేతాలకు ఇది నిదర్శనమనే అభిప్రాయం కాపు సామాజికవర్గ సంఘ నేతల నుంచి వినిపిస్తుంది.



