మా ఎన్నిక‌ల్లో… కాపా.. క‌మ్మా!

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్న‌ట్టు అది కొద్దిమంది సినీ న‌టులుండే సంఘం. మా అసోసియేష‌న్ గురించి అంత చ‌ర్చించ‌టం కూడా అన‌వ‌స‌రం. కానీ.. మీడియా మొత్తం అదేదో ప్ర‌పంచ విప‌త్తు అన్న‌ట్టుగా తెలుగు సినీ న‌టుల సంఘం మా గురించే చ‌ర్చిస్తున్నాయి. సినీ పెద్ద‌లు కూడా అటువైపే దృష్టిపెట్టార‌నాలి. పైకి అబ్బే… అదంతా జూజూబీ అని పైకి చెబుతున్నా.. మా లో మావాడే ఉండాల‌నే ఆలోచ‌న మాత్రం లేక‌పోలేదు. ఇదంతా ఎందుకంటే.. తెలుగు సినిమా ఎంత కాద‌నుకున్న కులపునాదుల‌పైనే నిర్మించ బ‌డింది. నాగ‌య్య కాలం నుంచి నాగార్జున వ‌ర‌కూ… ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వ‌ర‌కూ అన్నింటి కుల‌మే ప్రాధాన్యం. అడ‌పాద‌డ‌పా ఏ ఒక‌రిద్ద‌రో హ‌ర‌నాథ్‌, రామ‌కృష్ణ‌, చంద్ర‌మోహ‌న్ వంటి వాళ్లు మెరిసినా కేవ‌లం స‌హ‌న‌టులుగానే మిగిలారు కానీ స్టార్‌గా ఎద‌గ‌లేక‌పోయారు. కానీ.. చిరంజీవి మాత్రం అంద‌రివాడుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ 35 ఏళ్లుగా మెగాస్టార్‌గానే ఉన్నారు. అయితే చిరంజీవితో పాటు వెంక‌టేష్‌, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి వాళ్లు స్టార్‌గా త‌మ‌కంటూ ఇమేజ్ సృష్టించుకున్నారు. అయితే.. ఇక్క‌డ చిరంజీవి వ‌ర్సెస్ బాల‌కృష్ణ అనే పోటీ మాత్రం 1980ల నుంచి కొన‌సాగుతూనే ఉంది. సంక్రాంతి, ద‌స‌రా సినిమాల బ‌రిలో ఇద్ద‌రి సినిమాలు విడుద‌ల‌య్యేవి. ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లూ జ‌రిగేవి. 1996 త‌రువాత వాతావ‌ర‌ణం మారింది. క‌మ్మ అంటే బాల‌కృష్ణ ఫ్యాన్స్‌, కాపు అంటే చిరంజీవి అభిమానులు అనేంత‌గా విడిపోయారు. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీతో క‌మ్మ‌, కాపు, రెడ్డి అనే మూడు కులాల‌కు మూడు పార్టీలుగా మారింది. ఆ త‌రువాత చిరంజీవి పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేయ‌టం జ‌రిగాయి. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్ట‌డాన్ని రెడ్డి వ‌ర్గం వ్య‌తిరేకించింది. అప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్‌లో రెడ్డితో కాపుల‌కు రెడ్ల‌తో ఉండే సాన్నిహిత్యం దెబ్బ‌తిన్న‌ద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ టీడీపీ ఎమ్మెల్యే పైగా గ‌తంలో లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని ఆహ్వానించ‌క‌పోగా.. ఎవ‌ర్ని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచాలంటూ నోరుజారారు. ఇటీవ‌ల సినీ పెద్ద‌ల స‌మావేశానికి బాల‌య్య‌ను ఆహ్వానించ‌లేదు. తాజాగా కూడా బాల‌య్య మీటింగ్‌లో క‌నిపించ‌లేదు.

ఈ ప‌రిణామాల‌న్నీ మా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపేవే అనేది సినీ పెద్ద‌ల విశ్లేష‌ణ‌. మెగా కుటుంబం.. ప్ర‌కాశ్‌రాజ్ అభ్య‌ర్థిత్వాన్ని బ‌ల‌ప‌రచ‌గానే.. మంచు విష్ణు రంగంలోకి దిగి నేను కూడా బ‌రిలో ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు. నంద‌మూరి కుటుంబాన్ని క‌ల‌సి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇప్పుడు మా ఎన్నిక‌లు సెప్టెంబ‌రులో జ‌ర‌పాల‌నే నిర్ణ‌యంతో మాలో కుల స‌మ‌రం ఖాయ‌మ‌నే అంచ‌నాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. మా అధ్య‌క్షుడుగా ఎవ‌రు గెలిచినా.. మ‌రోసారి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సంకుల స‌మ‌రం మొద‌లైన‌ట్టేనంటూ సినీవ‌ర్గాలు అంచ‌నా వేసుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here