కొన్ని చిత్రాలు పేరుతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ‘కర్మణ్యే వాధికారస్తే’ టైటిల్ తోనే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ:
విశాఖ పట్నంలో కొంత మంది వ్యక్తులతో అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని చిరునామాలు ఫేక్ అని తెలుస్తాయి. మరోవైపు మన దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అధికారులను కొంత మందిని హనీ ట్రాప్ చేయడానికి కొంత మంది అమ్మాయిలను మన శత్రు దేశాలకు చెందిన ముఠా సభ్యులు ఎరగా వేస్తుంటారు. వారిని కౌంటర్ చేయడానికి ఎన్ఐఏ అధికారి జిష్ణు తన తోటి అధికారితో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అనుమానాస్పద వ్యక్తుల మరణాల వెనక పెద్ద నెట్ వర్క్ ఉంటుందనే విషయం ఏసీపీ (శత్రు)కు తెలుస్తుంది. మరో కేసుకు సంబంధించి ఓ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ (బ్రహ్మాజీ) తన వంతుగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మొత్తంగా అనుమానాస్పద మృతుల వెనక మిస్టరీని ఎలా ఛేదించారు? దీని వెనక ఎవరున్నారు. చివరకు దేశ ద్రోహుల ఆటను ఎలా కట్టించారనేదే ‘కర్మణ్యే వాధికారస్తే’ స్టోరీ.
విశ్లేషణ:
దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి ‘కర్మణ్యే వాధికారస్తే’ కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఈ కథను రచయిత శివ కుమార్ పెల్లురు బాగా రాసుకున్నారు, డైలాగ్స్ కూడా తనే సందర్భానికి అనుకునంగా పదునైన మాటలతో మెప్పించాడు. శివకుమార్ పెల్లురు రాసుకున్న కథ మాటలకు దర్శకుడు అమర్ దీప్ చెల్లపల్లి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, డిఫరెంట్ టేకింగ్ తో మెప్పించాడు. ఈ సినిమాలో కొంత మంది వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు, మరోవైపు ఓ వ్యక్తి అమ్మాయిలతో డేటింగ్ అని చెప్పి వారిని ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తూ ఉంటాడు, అయితే దర్శకుడు ఎంచుకున్న కథ అద్భుతంగా ఉంది, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఇంకా బాగుంది , అందుచేతనే సినిమా మరో లెవల్లో ఉంది, ముఖ్యంగా అమ్మాయిలను అనుభవించి చంపడం.. దాని వెనక ఉన్న ఉద్దేశ్యం. మరోవైపు మన దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఎలా ఆధార్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ అక్రమంగా ఇచ్చిన మన దేశ పౌరులుగా ఎలా మారుస్తున్నారు. ఇక అమ్మాయిలతో ఇంటిమేట్ హాట్ సీన్స్ కఆకట్టుకున్నాయి. మన దేశ రక్షణ అధికారులను విదేశీ శక్తులు కొంత మంది అమ్మాయిలతో సోషల్ మీడియా పరిచయాల వేదికగా ఎలా పరిచయమై వారిని హని ట్రాప్ చేస్తున్నారనే అంశం బాగుంది. అక్రమ వలస దారులకు ఆధార్ సహా ఇతర ఐడెండిటీ కార్డులతో దేశ పౌరులుగా ఎలా మారుస్తున్నారు. దీని వెనక కొంత మంది రాజకీయ నాయకులు హస్తం ఉంటుందనే విషయాన్ని సినిమాలో చెప్పే ప్రయత్నం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ ముందు పోకిరి తరహా ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు, బాగా సెట్ అయ్యింది, శ్యామల భాస్కర్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ, కెమెరా వర్క్ చాలా డీసెంట్ గా ఉంది, లొకేషన్స్ , లైటింగ్ ఇలా అన్ని ఫర్ఫెక్ట్ గా తెరమీర చూపించారు సినిమాటోగ్రఫర్ శ్యామల భాస్కర్. మొత్తంగా దర్శకుడిగా అమర్ దీప్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.
శత్రు.. ఇప్పటి వరకు మనం విలన్ గా చూసాము. ఈ సినిమాలో ఏసీపీ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. భవిష్యత్తులో మంచి కథలు ఎంచుకుంటే హీరోగా పనికొస్తాడు. సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో మంచి ఈజ్ చూపించాడు. బ్రహ్మాజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. శివ నుంచి సింధూరం, ఖడ్గం వరకు అన్ని రకాల పాత్రల్లో మెప్పించాడు. ఇందులో సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయాడు. మహేంద్రన్ విజ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ఒక మంచి సినిమా చూసిన అనుభూతితో ప్రేక్షకులు కర్మణ్యే వాధికారస్తే చూసి బయటకు వస్తారు. ఈ చిత్ర దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి, రచయిత శివకుమార్ పెల్లురు, నిర్మాతలు దుర్గాప్రసాద్ దేవినేని, జవ్వాజి సురేంద్ర కుమార్ లకు కర్మణ్యే వాధికారస్తే మొదటి సినిమా అయినా సరే అనుభవం కలిగిన వారిలా సినిమాను రూపొందించారు, కథ, కథనం, కెమెరా వర్క్, సంగీతం, ఇలా ఈ సినిమాకు అన్ని కలిసి వచ్చాయి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడగడ్డ సినిమా ఇది.
రేటింగ్: 3/5
Karmanye Vadhikaraste Movie Review And Rating



