కత్తి కార్తీక.. అప్పట్లో వీ6 యాంకర్‌గా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసులో నిందితురాలిగా నిలబడ్డారు. ఔను.. కత్తి కార్తీకపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అమీనాపూర్‌లో 52 ఎకరాల్లో కన్‌స్ట్రక్షన్ చేస్తానంటూ.. సెటిల్‌మెంట్ చేయిస్తానంటూ.. మందీమార్బలంతో కలసి ఆమె కోటిరూపాయలు కొట్టేసిందనేది ఫిర్యాదు సారాంశం. ఆ తరువాత ముఖం చాటేయటం.. డబ్బు గురించి అడిగితే.. చూద్దాంలే అంటూ తప్పించుకోవటంతో బాధితులు ఠాణాకు చేరారట. వాస్తవానికి కత్తి కార్తీకకు బి.డిజైనర్స్ పేరుతో ఆర్కిటెక్సర్ సంస్థ ఉంది. లండన్‌లో ఆర్కిటెక్ పూర్తిచేసిన కార్తీక హైదరాబాద్‌లో చాలా ప్రాజెక్టులు సొంతం చేసుకున్నారు. తెలంగాణ సర్కారు కూడా బోలెడు కాంట్రాక్టులు ఇచ్చిందనే గుసగుసలూ లేకపోలేదు. కానీ. దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. గట్టిగా ప్రచారం కూడా చేస్తున్నారండోయ్.. మరి ఇంతలో ఏమైందో.. కార్తీకపై ఫిర్యాదు కేసులు. మరి ఇదంతా దుబ్బాకలో పోటీచేస్తున్న ఫలితమా! లేకపోతే నిజంగానే కార్తీక మోసానికి పాల్పడ్డారా అనేది పోలీసులు దర్యాప్తులో తేలాలి.