కైనీ మిల్క్ ఐదు రోజులు నిల్వ చేసుకోవ‌చ్చు!!

ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్న కైనీ మిల్క్ ను ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్దక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్. రంగయ్య, శరద్ లతో కలిసి ఆయన తన నివాసంలో టెట్రాప్యాకెట్ లో ఆరునెలలు నిల్వ ఉండే పాల ప్యాకెట్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విదేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వికారాబాద్ జిల్లాల్ ఫ్యాక్టర్ ప్రారంభించనుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్యాక్టరీ ద్వారా మరింతమందికి ఉపాధి కలగనుందని, సంస్థ మరింత అభివ్రుద్ది చెందాలని మంత్రి తలసాని ఆకాంక్షించారు.

తమ కంపెనీ నుంచి వస్తున్న కైనీ మిల్క్ తెలుగురాష్ట్రాల్లో ప్రారంభించడంపై కంపెనీ సిఇఓ డాక్టర్ రంగయ్య “ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో ప్రారంభించాం. విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ భారతదేశంలో కూడా ఇన్విస్ట్మెంట్ చేయాలని 2017లో తెలంగాణ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత టీఎస్ పాస్ ద్వారా ల్యాండ్ , పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఉమోనోవా డైరీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు 200 కోట్ల రూపాయల ఇన్విస్ట్మెంట్ తో వికారాబాద్ జిల్లాలోని హైదరాబాద్ – ముంబాయి రహదారికి సమీపంలో ఈ ప్యాక్టరీని స్థాపించబోతున్నాం. ప్రపధమంగా Schreiber Dynamix Dairies Pvt.ltd. వారి భాగస్వామ్యంతో కైన్ మిల్క్ లాంగ్ లైఫ్ మిల్క్ ఈ రోజు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని భారతదేశం అంతటా కూడా ఆ ప్రాడక్ట్ ను ప్రారంభిస్తున్నాం. నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ లో ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వరకు ప్రతినెల అమ్ముతున్నాము. దీన్ని భారతదేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా విరివిగా ప్రాచుర్యం ఉంది. జనవరి నుంచి ఈ ప్రోడక్ట్ ను అక్కడ కూడా ప్రారంభించబోతున్నాం. ప్రెష్ మిల్క్ లో కూడా పల్లె పాలు అనే బ్రాండ్ తో వచ్చే సంవత్సరం మద్యవరకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో రీలీజ్ చేయబోతున్నాం. మేము ప్రోటీన్స్ ప్రొడక్ట్స్ లో కూడా వస్తున్నాం. అవి కూడా తర్వలో ప్రారంభంకానున్నాను. ఇప్పుడు న్యూట్రీషియన్ పోషకవిలువల విలువ ఎంతో మీ అందరికీ తెలుసు. పోషక ఆహారమే పరమౌషధం. సో మేము నాణ్యతా ప్రమణాలతో అతి తొందరగా వినియోగదారులకు చేరువై వచ్చే 5 ఏళ్లలో ఒక 500 కోట్ల రూపాయల కంపెనీగా మారబోతున్నామని చెప్పి తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా ప్రొడక్ట్స్ అందరి మన్నలను పొందుతుందని ఆశిస్తున్నాం. అలాగే మేము ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాం. విదేశి టెక్సాలజీతో మొదటిసారి ఇండియా లో నాకు తెలిసి ఇదే యూరోపియన్ టెక్నాలజీని వాడుతున్న దేశంలోనే అతి పెద్ద రెండో ప్లాంట్ కానుంది. ఈ టెక్నాలజీతో వచ్చిన ప్రతి ప్రొడక్ట్ కూడా మన్నిక నిలువ కాలం కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మేము అనేక క్వాలిటీ సెంటర్స్ ద్వారా ద్రీవికరించాం కూడా. అంతేకాకుండా ప్యాకేజింగ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంతో ప్రాచుర్యం పొందిన గేబుల్ టాప్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాం మా కంపెనీలో. ఇది 100శాతం రిసైకిల్ చేసుకునే ప్యాకేజీంగ్ ఇది. ఈ పద్దతిలో ప్యాకే అయ్యే వాటిని గేబుల్ టాప్ అంటారు. ఇక పై మా నుంచి వచ్చే ఫ్రెష్ మిల్క్ 5 రోజులపాటు నిల్వ చేసుకోవచ్చు. మాకు మిగలిని ఏ డైరీ కంపెనీ కూడా కాంపిటేటర్ కాదు. మేము ప్యాకింగ్ లోనూ, తర్వాత నాణ్యత లోకూడా ప్రత్యేకత స్థానం కలిగిఉన్నాం.” అని చెప్పారు

Previous articleతెలుగు హీరోలూ చీర క‌ట్టారండోయ్‌!
Next articleనవంబ‌రు 2 నుంచి మారేడుప‌ల్లి అడ‌వుల్లో పుష్ప‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here