ఎత్తి కొడితే ఏట్లో పడతావ్.. చుర్రు చుమ్మయింది. డైలాగ్ డెలివరీ ప్రత్యేకత. యాక్షన్‌లో ట్రెడ్‌కు కేరాఫ్ అడ్రస్ నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుడి కడుపున పుట్టిన యువసామ్రాట్ పుట్టినరోజు అగస్టు 29. 1959లో చెన్నైలో పుట్టిన ఈ మన్మథుడు నటించిన మొదటి సినిమా విక్రమ్ అనుకుంటారు. కానీ.. సుడిగుండాలు 1967లో అంటే 8 ఏళ్ల వయసులో తండ్రితో కలసి నటించారు. 1986లో హీరోగా విక్రమ్‌లో మెరిశారు. మొదటి సినిమా.. అక్కినేని వారసుడు.. ఎన్నో అంచనాలు. మధుసూదనరావు వంటి దర్శకుడు.. ప్రేక్షకుల నుంచి పర్వాలేదనే మెప్పుపొందాడు. పాటలు.. ఫైట్‌లలో ఇంకా పరిణితి కావాలంటూ ఆ నాడు సినీ పెద్దలు పెదవి విరిచిన సందర్భాలున్నాయి. అలా మొదలైన నాగార్జున సినీ జీవితంలో తొలుత ఫెయిల్యూర్ చవిచూశాడు. కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ వంటివి బాగా నిరాశపరిచాయి. అటువంటి సమయంలో దాసరి నారాయణరావు మజ్నుతో మాంచి హిట్ అందుకున్నారు. ఇప్పటికీ ఆ సినిమాలో ఇది తొలిరాత్రి కదలని రాత్రి అనే పాట గాయకుల నోటి నుంచి జాలువారుతూనే ఉంటుంది. నాగార్జున-నాగేశ్వరరావు కలసి నటించిన తొలిసినిమా కలెక్టర్‌గారి అబ్బాయి.. కమర్షియల్ హీరోగా నాగ్‌కు తొలి విజయం. ఆ తరువాత అగ్నిపుత్రుడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆఖరిపోరాటం తొలిసినిమా. అప్పటికే టాప్ హీరోయిన్లుగా ఉన్న శ్రీదేవి, సుహాసినితో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున వైపు ఎవ్వరూ చూసేవారు కాదట. అందరూ.. శ్రీదేవి, సుహాసిని వద్దనే ఉండేవారట.
1989 సంవత్సరం నాగార్జునకు బ్రేక్ ఇచ్చింది.. యువసామ్రాట్‌ను చేసింది. గీతాంజలితో మణిరత్నం, శివ సినిమాతో రాంగోపాల్‌వర్మ.. నాగ్‌లోని కొత్త కోణాన్ని వెండితెరకు పరిచయం చేశారు.. అలా.. హిట్లు.. ప్లాప్‌లు అందుకుంటూ.. నిన్నేపెళ్లాడతాతో ట్రెండ్ సెట్ చేశారు. ఆ తరువాత అన్నమయ్యతో.. రక్తితోపాటు.. భక్తిని పండించి మైమరిపించారు. శిరిడీసాయి, శ్రీరామదాసు, నమో వేంకటేశాయ వంటి భక్తి చిత్రాలతో నాగేశ్వరావు తగిన వారసుడుగా మెప్పించారు. 60 ఏళ్లు వచ్చినా సోగ్గాడే చిన్నినాయనా అంటూ.. ముద్దుగుమ్మల నాగ్‌కే జై కొడుతున్నారు. ఇంతగా మెప్పించే నాగ్ తొలిక్రష్ మూడో తరగతిలోనేనట. తొలిముద్దు..ఇంటర్‌లో నట. గీతాంజలి సినిమా.. తండ్రి నాగేశ్వరరావుకునచ్చిన సినిమా. లక్కీనెంబరు ఎంతో తెలుసా.. 3, ఎందుకంటే.. మార్చి 21 అమల పుట్టినరోజు కాబట్టి అంటారు. బెస్ట్‌ఫ్రెండ్ పేరు మల్లిఖార్జున. నచ్చిన ఫుడ్ మెకరోని చీజ్. ది ఫౌంటెన్ హెడ్ నాగ్‌కు నచ్చిన పుస్తకం. తొలి మొబైల్ ఫోల్ ఏదో తెలుసా.. నోకియా6110 ఇప్పటికీ నాగ్ వద్దనే ఉందట. నాగార్జున మొదటి భార్య పేరు లక్ష్మీ. సినీ నటుడు వెంకటేష్ సోదరి.. ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. అమలను పెళ్లాడారు. వీరి పిల్లలే నాగ్‌చైతన్య, అఖిల్. కేవలం హీరోగానే గాకుండా.. నిర్మాతగా.. బిగ్‌బాస్ ప్జజెంటర్‌గా.. మా టీవీ అధినేతగా.. అన్నపూర్త స్టూడియే నడిపించే యజమానికి.. ఇన్నిపాత్రలు పోషిస్తున్ననాగ్.. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మన్మథుడే.