కేసీఆర్ ఘనత చెప్పిన కిషన్ రెడ్డి!!

GHMC ఎన్నికల వేడి భాగ్యనగరంలో రోజు రోజు పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం యూసూఫ్ గూడా లోని ఒక ఫంక్షన్ హాల్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి TRS ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు, నగరంలోని పలు ప్రాంతాల వరదలకు అందించాల్సిన సహాయంలో కూడా ఎంతో అవినీతి జరిగిందని, పార్టీ కార్యకర్తలకి మాత్రమే నగదు సహాయం అందిందని ఆరోపించారు. GHMC పరిధిలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు కల్పించారని ప్రశ్నించారు. దేశంలోనే ప్రధమంగా రాష్ట్రంలో సచివాలయం లేకుండా పరిపాలన చేస్తున్న ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. రాబోయే GHMC ఎన్నికలలో బీజేపీని గెలిపించుకొని స్థానిక సమస్యలకు పరిష్కారాలను పొందాల్సిందిగా ఓటర్లకు సలహా ఇచ్చారు.

Previous articleరెనోవా హాస్పిటల్స్ మరో బ్రాంచ్ ప్రారంభం
Next articleఇక రెస్టారెంట్ గా మార్చాల్సిందే !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here