కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ 1000 కుటుంబాలకు చేదోడు

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సుమారు 1000 కుటుంబాలకు చేదోడుగా నిలిచింది. షూటింగ్ మొత్తం ఊటీ లో జరగడం వలన ఆ పరిసర ప్రాంతాలైన కళ్ళట్టి, మసన గుడి వంటి గ్రామాలను ఎంచుకొని అవసరం ఉన్న వారికి బియ్యం మొదలు ఉప్పు వరకు ఇది లేదు అనిపించుకోకుండా ప్రతిదీ సమకూర్చి అందించారు .ఈ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని “రిచి గాడి పెళ్లి” అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది ఆ చిత్ర విశేషాలు పంచుకుంటూ

దర్శకుడు హేమరాజ్ కె.ఎస్ … “రిచిగాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో అనుకోని పరిణామం కరోనా.. దేశం మొత్తం లాక్ డౌన్ తో స్తంభించి పోయింది. చాలామంది ఉపాధి కోల్పోవడం గమనించాం. వారందరికీ ఏదోటి చెయ్యాలని సాధ్యమైన రీతిలో నిత్యావసర సరుకులు అందించాం ..

Previous articleఐదు భాషల్లో విడుదల చేస్తున్న “ఇక్షు” ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.
Next articleముగ్గురు సివిల్స్‌… @ పాలిటిక్స్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here