సినీ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతుల మీదగా ఘ‌నంగా లాడియా డైమండ్ స్టోర్ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ షోరూం లాడియా, పంజాగుట్టలో లాడియా రెండవ స్టోర్‌ను తేజస్వి ప్లాజాలో ఏర్పాటు చేసిన లాడియా రెండో స్టోర్‌ ను మాజీ పార్లమెంటు సభ్యుడు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, టీపీసీసీ జాతీయ అధికార ప్రతినిధి మధు యాస్కిగౌడ్, ప్ర‌ముఖ సిని నటి శ్రీమతి సంయుక్త మీనన్ తో కలసి లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రారంభించారు. లాడియా ల్యాబ్‌లో రూపుదిద్దుకున్న‌ వజ్రాభరణాలు ప్రపంచంలో ప్ర‌త్యేక‌మైన‌వి. లాడియా ఆవిష్కరణ వినియోగ‌దారుల విశ్వాసాన్ని చూర‌గొన్న‌ది. వజ్రాల‌ను అంద‌రికి అందుబాటులోకి తెచ్చేందుకు లాడియా కృషి చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశం వ‌జ్రాల ల్యాబ్ -గ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింద‌న్నారు. ఈ రంగంలో వినూత్న ఆలోచనలతో విభిన్న ఆవిష్కరణల‌కు లాడియా కట్టుబడి ఉన్నాద‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నామ‌న్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జ్యువెలరీ హబ్‌లో రెండవ స్టోర్‌ను ప్రారంభిచ‌డం గౌర‌వంగా ఉంద‌ని, సహజ వనరుల నివారణ మరియు హానికరమైన మైనింగ్ పద్ధతులను తగ్గించడం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రత్యేకత అని తెలిపారు.

లాడియా ల్యాబ్‌లో రూపుదిద్దుకునే వజ్రాభ‌ర‌ణాలు క‌చ్చిత‌మైన నాన్య‌తాప్ర‌మాణ‌ల‌తో త‌యారు చేయబడతాయి, ఇక్కడ ఎంతొ నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వజ్రాభ‌ర‌ణాలు త‌యారు చేస్తార‌ని చెప్పారు. ఇక్క‌డ ల్యాబ్‌లో త‌యారు చేయ‌బ‌డే స‌హ‌జ‌మైన ప్ర‌కృతి సిద్ధ‌మైన వజ్రాభ‌ర‌ణాలు మేలు క‌లిగిస్తాయ‌ని పేర్కొన్నారు. ల్యాబ్‌లో చేయ‌బ‌డిన‌ వజ్రాలు సహజ వజ్రాల వలె అదే రంగు మరియు స్పష్టత స్థాయిని ఉపయోగించి కూడా గ్రేడ్ చేయబడిన‌విగా తెలిపారు.

లాడియాలో తయారు చేయబడిన బంగారు వ‌జ్ర ఆభరణాలు విస్తృత ఎంపికతో లభిస్తాయ‌ని, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్, పెండెంట్‌లు, కంకణాలు, చెవిపోగులు, ఝుమ్‌కాస్, ఉంగ‌రాలు ప్రత్యేకమైన ల్యాబ్లో పోల్కిస్, కస్టమైజేషన్-మేక్ యూరోన్ డిజైన్‌ల‌లో అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. త‌మ వజ్రాల ఆభరణాలు డైమండ్ గ్రేడింగ్ సర్టిఫికేషన్‌లో గ్లోబల్ అథారిటీ అయిన IGl నుంచి ధృవీక‌రించిన‌ట్లు పేర్కొన్నారు. వినియోగ‌దారుల‌కు క్యారెట్ డైమండ్ ధర రూ. 24,999 ((EF-VVS)తో విభిన్న సేకరణలు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండి బీకన్ రిలేషన్స్, AJ ఈవెంట్స్ ఆర్యన్ 9573391749.

Previous articleఆమనగల్ లో సెల్‌బే మొబైల్ స్టోర్ ప్రారంభం
Next articleతెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here