ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు చేతి పై వేసే క్వారంటైన్, ఇమ్మిగ్రేషన్ స్టాంపుల లో ఉపయోగించే రసాయనిక ఇంకు వల్ల తన చేతి పై వచ్చిన ఇన్ఫెక్షన్ ఫోటోను జతచేస్తూ కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి కి ట్విట్టర్లో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ స్టాంప్ ఇంకులో ఏ రసాయనాలు వాడుతున్నారో చూడాలని కోరారు. ట్వీట్‌పై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినందుకు అభినందిస్తూ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎండీతో తగిన పరిష్కారం కోసం చర్చించినట్లు తెలిపారు.