ఆంధ్ర అమ్మాయితో మెగా హీరో పెళ్లి?

మెగాస్టార్ ఇంట మ‌రో హీరో పెళ్లిపీటలు ఎక్క‌బోతున్నారు. ఇప్ప‌టికే నాగ‌బాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో ఫిక్స్ అయింది. పెళ్లి ముహూర్త‌మే ఖ‌రారు కావాల్సి ఉంది. ఇదే సంద‌డిలో మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ ల‌గ్గం కూడా కానిచ్చేయాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బంధువుల అమ్మాయిను చూసిన‌ట్టుగా కూడా ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లి విష‌యంలో చిరంజీవి పెద్ద‌రికం వ‌హించార‌ట‌. ఆడ‌పిల్ల త‌ర‌పు కుటుంబం కూడా సామాజికంగా మంచి గుర్తింపు ఉండ‌టం.. సాయిధ‌రమ్‌తేజ్‌కు త‌గిన‌ట్టుగా ఆ అమ్మాయి ఉండ‌టం కూడా చిరంజీవికి న‌చ్చింద‌ట‌. అయితే ముహూర్తం ఎప్పుడు.. ఎంగేజ్‌మెంట్ ఎక్క‌డ జ‌ర‌పాల‌నేది త్వ‌ర‌లో
ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇప్ప‌టికే కుర్ర‌హీరోల్లో ఒక్కొక‌రు పెళ్లిపీట‌లు ఎక్కుతున్నారు. నితిన్, అఖిల్‌, రానా ఇలా బ్యాచిల‌ర్ పార్టీలు ఇచ్చేశారు. న‌చ్చిన అమ్మాయిను పెళ్లిచేసుకుని ఒక ఇంటివార‌య్యారు. ఇప్పుడు సాయి ధ‌ర‌మ్‌తేజ్ కూబా సోలోబ‌తుకే సో బెట‌ర్‌తో రాబోతున్నారు. బ్యాచిల‌ర్ పార్టీ కూడా ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌రుస హిట్ల‌తో మెగా మేన‌ల్లుడు దూకుడు మీదున్నాడు. సినిమాల ఎంపిక‌లోనూ మేన‌మామ చిరంజీవి జోక్యంతో ట్రాక్‌లో ప‌డ్డాడు. అదే మేన‌మామ చూసిన పెళ్లిసంబంధంతో ఒక ఇంటివాడు కూడా కాబోతున్నాడంటున్నారు మెగాభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here