తన భార్య కోసం ఓ భర్త జీవిత త్యాగం

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సబంధాలే అని కార్ల్ మార్క్స్ మహనీయుడన్నట్లు..
నేడు రక్త సంబంధాలతో పాటు వివాహబంధాలు సైతం ఆర్ధిక విషయాల సునామీకి విచ్ఛిన్నమవుతున్నాయి..తల్లి దండ్రులు, గురువు, వైద్యుడు ..మరియు పతియే దైవం అన్నారు గాని..
భార్యా దేవతోభవ అన్న సందర్భాలు బహు అరుదు.. తమ భర్తల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన సతీ, అనసూయ, సావిత్రి సుమతి వంటి మహా త్యాగ మూర్తులను పురాణాల్లో చూసాం కానీ..
భార్యను దేవతలాగా ఆరాధించిన మానవీయ విలువలతో హృదయానికి హత్తుకునే ఓ భర్త త్యాగమే ఈ కథ… తప్పక చదవండి..
హృదయానికి హత్తుకునే మానవీయ విలువలతో కూడిన కథ..

సలీం ఓ మధ్య తరగతి ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన చురుకు, తెలివితేటలు గల యువకుడు. తండ్రి లారీ మెకానిక్. తల్లి గృహిణి..సలీం తో పాటు రిజ్వాన్ 14 ఏళ్ళున్న కూతురు..

శర్మిష్ఠ ఒక్కతే కూతురు..సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోని యువతి..తండ్రి పురోహితుడు. తన కూతురికి
సంగీతం, సాంప్రదాయ నృత్యాలు నేర్పించాడు. అద్భుతమైన తెలివితేటలు , అందమైన పుత్తడిబొమ్మ.
తల ఎత్తితే తన దారిని తప్ప వేరేవైపు తలతిప్పే రకంకాదు..

సలీం, శర్మిష్ఠ ఇద్దరూ యూనివర్సిటీలో ఓకే తరగతిలో చేరారు..ఒక సంవత్సరం అనంతరం కాస్త మాట్లాడుకోవడం..అది కాస్తా ప్రేమ దాకా వచ్చి..అమ్మాయి తల్లి దండ్రులు ఒప్పుకోవక పోవడం. ఎదిరించి ఆర్య సమాజ్ లో పెళ్లి..

కట్ చేస్తే..
5 ఎళ్ళ అనంతరం ఇద్దరూ ఉద్యోగులే..

దేవుడు నిర్దయుడు కదా! పాపం చూడలేకపోయాడు.

శర్మిష్ఠ తాను డ్యూటీ కి స్కూటీ మీద వెళ్లే దారిలో యాసిడ్ టాంకర్ లీక్ అయి, ఆ ప్రభావంతో పాపం ఒళ్ళంతా గాయాలు..ముఖ్యంగా ముఖం అంతా కాలి పోయింది..

సలీం మామూలుగానే ఉన్నాడు.. కానీ, శర్మిష్ఠ తాను కురూపినవుతానేమో నని భావం, వారి ఇద్దరి మధ్య ఉన్న అత్యంత ప్రేమ, ఆప్యాయతలు తగ్గుతాయేమోనని కలిగిన న్యూనతా భావం..వంటివి శర్మిష్ఠలో చెలరేగుతున వ్యతిరేక భావనలు.

ఈలోగా శర్మిష్ఠకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆమెలో మునుపటి ముఖారవిందం గుర్తు పట్ట లేకుండా ఉంది.

ఇంతకుముందు అనుకున్నాం కదా దేవుడు నిర్దయుడు అని..
శర్మిష్ఠ యొక్క కురూపి ముఖాన్ని ఒక రోజు ముందే చూసాడు.. కానీ సలీం తనను చూసినట్లు శర్మిష్ఠకు తెలియలేదు..

చికిత్స అనంతరం తన ముఖాన్ని తనతో పాటు సలీం కూడా ఆ రోజు చూడబోతున్నాడు అనే ఆనందం లో ఉన్న శర్మిష్ఠకు పిడుగు లాంటి వార్త.. తన భర్త రోడ్ ప్రమాదానికి లోనయ్యాడని. అంతకన్నా దురదృష్టం ఉంటుందా?

మరుసటి రోజు
శర్మిష్ఠ కళ్ళు తెరిచి తనను తాను గుర్తు లేనంతగా మారిపోయింది..వారం తరువాత ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు..

మంచంలోనే ఉన్న సలీం కి సేవలు చేస్తుంది..ఉద్యోగంలో కూడా తిరిగి చేరింది..
సహ ఉద్యోగులు కొందరు శర్మిష్ఠను పలకరించి తన దురదృష్టానికి సానుభూతి చూపుతున్నారు..

శర్మిష్ఠ ఆఫీసు లో కొందరు..దీనికి తగిన శాస్తే జరిగింది..అందగత్తెనని పొగరుతో పొంగిపోయేదని చెవులు కోరుకునే మగ వెధవలు, మెటికలిరిసే కొందరు ఉద్యోగినులు..సహజం..

మన పని మనం చేసుకుపోతున్నా కొందరికి నచ్చదు కదండి! అందుకు..

సలీం కి జరిగిన ప్రమాదంలో కాలు విరగడం తో పాటు రెండు కళ్ళు పోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సలీం శర్మిష్ఠను చూడలేకపోవడం, సలీంకు కళ్లుoడి ఉంటే తను కురూపిననే మిషతో వదిలివేసేవాడేమోననే భావన అప్పుడప్పుడు కల్గుతుండేది..కానీ శర్మిష్ఠ మనసులో అందాన్ని మాత్రమే చూసే సలీం అలా మారతాడాని అనుకుంటామా? అంతా ఆనందంతో సవ్యంగా సాగిపోయింది కాలం..

పిల్లలు పెరిగి పెద్దయ్యారు..పెళ్లిళ్లు..అన్ని భాధ్యతలు తీరాయి..శర్మిష్ఠ పదవీ విరమణ చేసింది..మరుసటి సంవత్సరంలో శర్మిష్ఠకు కిడ్నీ జబ్బు రావడంతో చనిపోయింది..

మృత దేహం తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు..పిల్లలు మనవళ్ళు, బంధువులు వచ్చారు..మంచంలో వున్న సలీం లేచి వాకర్ తో ఎవరి సహయం లేకుండా సరాసరి శర్మిష్ఠ శవం దగ్గరకు వచ్చి బోరున ఏడవడం చూసి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు..
అంతా నిశబ్దం…
అందరూ సలీం ని సముదాయించారు. అప్పుడు
సలీం నోరు విప్పాడు.

మేము ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం మాది రెండు శరీరాల కలయిక కాదు.. రెండు ఆత్మల కలయిక. శర్మిష్ఠ కురూపి కనుక నేను వదిలేస్తానేమోనని, తన మనసులో అనుకునేది..అది తన తప్పు కాదు..నామీద ఉన్న అతి ప్రేమ (over possessiveness) శర్మిష్ఠ జీవితాంతం బాధ పడకుండా, ఆనందంగా, ఉండాలని గుడ్డి వాడిగా నటించా..నా భార్య ఆనందం కన్నా నాకు ఎక్కువ ఈ జగత్తులో లేదు అందుకే అన్నారు Marriage is a combination of two Souls but not two Physical Bodies..

✒️…పెర్నా విశ్వేశ్వరరావు
సత్తుపల్లి..ఖమ్మం జిల్లా
చరవాణి.9704197101

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here