ప్రాణాలు కాపాడే… పోలీసులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో విధినిర్వహణలో తలమునకలయ్యారు. మహానగరాన్ని వెంటాడుతున్న భారీవర్షాలు, వరదలతో నష్టపోతున్న కాలనీలు.. బస్తీలను ఖాకీలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు నగరంలో రక్తనిల్వలు తగ్గటంతో రక్తదానం చేసేందుకు వందలాది మంది పోలీసులు మందుకు వచ్చారు. మంగళవారం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సారథ్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనదైన శైలిలో ప్రజల మన్ననలు అందుకు సీపీ మహేశ్ భగవత్ మరో సారి ప్రజల మనసులో స్థానం దక్కించుకున్నారు. సివిల్స్ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు వాట్సప్‌గ్రూప్ ఏర్పాటు చేసి వారికి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యేందుకు దిశానిర్దేశం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది సివిల్స్ లో ర్యాంకు సాధించి ఉన్నత హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో వైపు రక్తదాన శిబిరాలతో తలసీమియా, రోడ్డు ప్రమాదాల్లో అవసరమైన వారికి రక్తాన్ని సకాలంలో అందేలా ఏర్పాట్లు చేస్తూ సీపీ మహేశ్ భగవత్ అభినందనలు అందుకున్నారు. ఈ రోజు నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో 1500 మందికి పైగా రక్తదానం చేశారు.