ఒకే రోజు రెండు పండుగలు రావటం అంటే ఇదే. మెగాఫ్యాన్స్‌కు నిజంగానే బుధవారం ఫెస్టివల్ వంటిదే.. లోకల్ ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్లు లుక్‌తో ఇరగదీశారు. ఆచార్య టీజర్ ఈ రోజు రిలీజ్ అవుతుందని ఆశపడినా… ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ నటించనున్న మళయాళ సినిమా అయ్యప్పానుమ్ కోశియమ్ రీమేక్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ రెండింటికీ సంబంధించిన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.