ఔనా.. అనే సందేహం వద్దు. సినీవర్గాల్లో ఇప్పుడిదే హాట్‌టాపిక్. మెగా హీరోల సినిమాలంటే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ వర్షం. సైకిల్ స్టాండ్.. క్యాంటీన్ వరకూ అందరికీ మస్త్ పండుగ. థియేటర్ల వద్ద వారం ముందు నుంచే హంగామా. అటువంటిది.. కరోనా పుణ్యమాంటూ దాదాపు ఏడు నెలలుగా సినిమా థియేటర్లు మూసివేతలోనే ఉన్నాయి. ఎప్పటికి తలుపులు తెరచుకుంటాయనేది చెప్పటం కూడా కష్టంగా మారింది. ఇది చిన్న సినిమాలకు బాగా కలసివచ్చింది.. తక్కువ బడ్జెట్‌లో తీసిన పదుల సంఖ్యలో సినిమాలకు ఓటీటీ వేదికలుగా మారి.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. జోహార్, జల్లికట్టు, 100, బానుమతిరామకృష్ణ వంటి ఎన్నో సినిమాలు అమెజాన్ ప్రైమ్, ఆహా ల్లో విడుదలయ్యాయి. ఇప్పుడు అదే బాటలో మెగా హీరో సాయిథరమ్‌తేజ్ సినిమా సోలో బతుకే సో బెటర్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుస ప్లాప్‌లతో కష్టాలు చవిచూస్తున్న సాయిధరమ్‌తేజ్‌కు చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలు సక్సెస్ బాట పట్టించాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి సినిమాల విషయంలో సూచనలు ఇస్తున్నారు. కథలు కూడా తానే పైనలైజ్ చేస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా దాదాపు పూర్తయింది. అయితే థియేటర్ల కారణంగా ఓటీటీలో విడుదల చేసేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చిందట. మరి ఇది ఎంత వరకూ ఓకే చేస్తారనేది ఆసక్తిగా మారింది. దసరా పండుగవేళ సినిమా విడుదలైతే.. మెగా అభిమానుల సందడే సందడి. అక్టోబరు 2న ప్రైమ్ అమెజాన్‌లో అనుష్క నిశ్చబ్దం విడుదల చేయనున్నారు.