సాయిధ‌రమ్‌తేజ్‌‌.. మెగా మేన‌ల్లుడు అనిపించాడు!!

సాయిధ‌రమ్‌‌తేజ్ అచ్చు చిరంజీవి లుక్‌తో.. మెగాఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. డ్యాన్స్‌.. ఫైట్ల‌లోనూ మేన‌మామ స్ట‌యిల్‌తో క‌నిపిస్తుంటాడు. ఇప్పుడు.. అదే మెగా మ‌న‌సు త‌న‌లో ఉంద‌ని చాటుకున్నాడు. పోయిన సంవ‌త్స‌రం విజ‌య‌వాడ‌లోని అమ్మఆద‌ర‌ణ సంస్థ‌కు సాయం కావాలంటూ నిర్వాహ‌కులు సాయిధ‌రమ్ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. దీన్ని చూసిన తాను వెంట‌నే స్పందించారు. ఆశ్ర‌మ నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చును తానే భ‌రిస్తానంటూ మాటిచ్చారు. ఇప్పుడు.. ఆ భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఏడాదిపాటు నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చు కూడా తానే భ‌రిస్తానంటూ చెప్పాడు. ఈ విష‌యాన్ని స‌న్నిహితులు ఎవ‌రో ట్వీట్ట‌ర్‌లో ఉంచారు. అంతే.. మెగాభిమానుల‌కు మ‌రింత జోష్ వ‌చ్చినంత ప‌నైంది. ప‌క్క‌వారికి ఆప‌ద వ‌స్తే.. స్పందించేందుకు చిరంజీవి, ప‌వ‌న్, రాంచ‌ర‌ణ్ తోపాటు.. ఇప్పుడు మేన‌ల్లుగు సాయిధ‌ర‌మ్ కూడా వ‌చ్చాడంటూ తెగ ఆనంద‌ప‌డుతున్నారు.

నిజ‌మే.. మెగా ఫ్యామిలీ చేసే గుప్త‌దానాలు చాలా వ‌ర‌కూ గోప్యంగా ఉంటాయి. కుడిచేత్తో చేసే దానం ఎడ‌మ‌చేతికి తెలియ‌కూడద‌నేంత నిబంధ‌న‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌నిపిస్తుందంటూ అభిమానులు భావిస్తుంటారు. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుడు వేడుక‌ల్లో అభిమానులు సేవా కార్య‌క్ర‌మాల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఏపీలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందులు ప‌డుతున్న ఆసుప‌త్రుల‌కు సుమారు రూ.40ల‌క్ష‌ల విలువైన వైద్య‌ప‌రిక‌రాలు అందించిన జ‌న‌సైనికులు సేవ‌కు తాము ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటామంటూ నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే బాట‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా సేవా కార్య‌క్ర‌మాల వైపు అడుగులు వేయ‌టం యూత్‌లో మ‌రింత ఉత్సాహాన్ని పంచుతుందంటున్నారు ఫ్యాన్స్‌. సాయి ధ‌ర‌మ్ కొత్త సినిమా సోలో బ‌తుకే సో బెట‌ర్ ఇటీవ‌ల షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఆ ఫొటోల‌ను కూడా సాయి ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here