
వేణువు ఊదిన కృష్ణుడుని పూజించాం.. సుదర్శనచక్రంతో శత్రువుల కుతుక్కులు తెగనరికిన కృష్ణుడిని ఆరాదించాం. మనం శాంతికాముకులం. కాదని కయ్యానికి కాలుదువ్వితే వీరత్వాన్ని చాటేందుకు సిద్ధంగా ఉన్న యోధులం.. లద్దాఖ్ శిఖరంపై భూమికి 12,000 అడుగుల ఎత్తున పహారా కాస్తున్న భారతదేశ సైనికులను ఉద్దేశించిన ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం. రోమాలు నిక్కబొడుచుకుని.. సై అంటే ఇప్పుడే సమరానికి సిద్ధమంటూ వేల అడుగుల ఎత్తులో శిఖరాలు ధ్వనించేలా.. చైనీయుల గుండెలు అదిరేలా.. పాకిస్తాన్ వెన్నులో వణకుపుట్టేలా చేసిన సమరనినాదం. యావత్ భారతజాతి మీ వెనుక ఉందని చాటేందుకు ప్రతినిధిగావచ్చానంటూ నరేంద్రుడు ఇచ్చిన ధైర్యం.. ఒక్క చైనానే కాదు.. యావత్ ప్రపంచాన్ని గెలిచేంతటి ధైర్యాన్ని సైనికులకు ఇచ్చింది. ఎవరైనా యుద్ధమంటే.. బంకర్లలో దాక్కుంటారు. ముఖ్యంగా ఏ దేశ నేతలైనా.. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంగా బాంబులు పేలితే చుట్టూ పహారా కోసం చూస్తారు. మరి… ఈయనేమిటో.. ఏకంగా చైనా సరిహద్దుల వరకూ వెళ్లి.. మీసం మెలేసి.. ఇది భారతీయ సత్తా అంటూ.. మా సైనికుల ధైర్యంగా నిలబడినపుడు నాకేమిటీ భయం అన్నంత తేలికగా లద్డాఖ్ చేరాడు. అదీ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని మరీ బోర్డర్ చేరాడు. ఊహించని షాక్‌తో వైరి దేశాలకు షాక్‌ల మీద షాక్‌లిచ్చాడు. చైనా ఆర్మీ దొంగదెబ్బతీసినా.. ఎదురు నిలిచి ధైర్యంగా శత్రువులను తరమితరమి కొట్టిన మీరు ఉండగా.. 130 కోట్ల మంది ప్రజలం హాయిగా ఉన్నామంటూ మీదే యావత్ భారతవని బాధ్యత అంటూ.. తన నమ్మకాన్ని ఎంత గొప్పగా పంచుకున్నాడు. రాజనీతి.. రణనీతి రెండింటా మాకు మేమే చాటంటూ తేల్చిన నరేంద్రుడు ఇప్పుడు ప్రపంచానికి గొప్ప రాజనీతిజ్ఞుడు. చైనా కుతంత్రాలకు చెక్ చెప్పేందుకు అటు మిత్రదేశాలతో మంతనాలు సాగిస్తున్నాడు.. మరోవైపు యుద్ధ సన్నద్ధతకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుతున్నాడు. శత్రువులను బలంగా కొట్టాలంటే.. ముందుగా వారిని మానసికంగా బలహీనులను చేయాలి. ఇవతల ఉన్నది శాంతికోపతమే అయినా.. దాని గోళ్లు ఎంత వాడిగా. వేడిగా ఉంటాయో
రుచిచూపాలి. ఇలా.. నలువైపులా భారతదేశ శౌర్యాన్ని.. ధైర్యాన్ని.. అన్నింటినీ మించిన పౌరుషాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసేందుకు.. చైనా ఒక్కటే కాదు.. చైనా వంటి వంద దేశాలు ఏకమైనా.. మేము ఎదుర్కోగలం.. మరోసారి మా వైపు
చూడకుండా బుద్దిచెప్పగలమంటూ సింహనినాదం చేసిన నరేంద్రుడు.. 130 కోట్ల ప్రజల తరపున అసలు సిసలైన నాయకుడు.