మంచు లక్ష్మి బర్త్‌డేకు మోహన్‌బాబు విషెస్ ఇంత గొప్పగా చెప్పారో చూస్తే.. గొప్ప తండ్రి అనే భావన కనిపిస్తుంది. తండ్రికూతుళ్ల బంధం చాలా గొప్పది. దీన్ని మోహన్‌బాబు తనదైన శైలిలో పంచుకున్నారు. కూతురు పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను అక్షరాల ద్వారా వ్యక్తపరిచారు. నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్నవజ్రవైఢూర్య పుష్యగోమేధిక మరకత మాణిక్యంలాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మ ఉంటుందో లేదో తెలియదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతరుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచ భూతాలను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే టుయు మై లవ్లీ లక్ష్మీ మంచు. గంబీరంగా కనిపించే మోహన్‌బాబు తనదైన శైలితో చెప్పిన శుభాకాంక్షలు ఆయన అభిమానులనే కాదు.. ఎంతోమందిని ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్లుగా ఇద్దరి మధ్య ఎంతటి గొప్ప అనుబంధం ఉందనేది తెలుస్తోంది. చిన్నారిగా ఉన్న లక్ష్మి ఫొటోను ట్వీట్టర్‌లో ఉంచారు. ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.



