టీటీడీ ఎల్ ఏ సి సభ్యునిగా నిర్మాత శ్రీ మోహన్ ముళ్ళపూడి



టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు, జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా శ్రీ మోహన్ ముళ్ళపూడి నియమితులయ్యారు. ఈయన గతంలో పలు సినిమాలు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(FNCC) హానరబుల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తూ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్‌ లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధి లో మరియు కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా చేపట్టిన బాధ్యతలను నిర్వహిస్తారు.

Previous articleఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణ
Next articleబాబ్జీ దర్శకత్వంలో పోలీసు వారి హెచ్చరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here