హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు నటి ముమైత్ ఖాన్ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తున్నాడు. తన క్యాబ్ ను గోవా ట్రిప్ కోసం 4 రోజులకు గాను బుక్ చేసిన ముమైత్ 7 రోజులు పొడిగించి, అదనంగా రావాల్సిన రూ. 15,000 ఇవ్వలేదని సోషల్ మీడియా లో ఆతని ఆవేదన చెప్పాడు. ఇలాంటి నష్టం ఇంకొక డ్రైవర్ కు జరగ కూడదని క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తానన్నాడు.



