మెగాబ్రదర్ నాగబాబు ఏది మాట్లాడినా సూటిగా ఉంటుంది. కాస్త కటవుగానే అనిపిస్తుంది కానీ.. అందులో వాస్తవం కూడా ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో ఈ మధ్య నెపోటిజం అనే మాట తరచూ వినిపిస్తుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ మరణం తరువాత ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై నటుడు, నిర్మాత నాగబాబు మనఛానల్ మన ఇష్టంలో మెగా కుటుంబంతోపాటు.. నెపోటిజంపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మెగా కుటుంబంలో నటుల జీవితం వండించిన విస్తరి కాదు. అందరూ కష్టపడాల్సిందే. ప్రేక్షకుల మెప్పు పొందితేనే మనుగడ లేకపోతే మూటాముల్లె సర్దుకుని వెళ్లాల్సిందేనంటూ బదులిచ్చారు. సాయిదర్మతేజ్ కూడా మెగా కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన హీరో కాలేదన్నారు. వి.వి.చౌదరి ఒకరోజు క్రికెట్ ఆడుతున్న సాయిధర్మతేజ్‌ను చూసి రేయ్ సినిమాకు ఎంపిక చేశారు. రెండ్రోజు తరువాత కానీ.. చౌదరికి సాయిబాబు మెగాస్టార్ మేనల్లుడని తెలియలేదన్నారు. రెండోసినిమా ఆరవింద్ నిర్మాతగా పిల్లానువ్వులేని జీవితం తీస్తానంటే మీ ఇష్టం అంటూ వదిలేశాం. అంతేగానీ.. వద్దు.. బంధుప్రీతి అంటారని అపగలమా! వరుసగా ఐదు ప్లాప్‌లు వచ్చినా తట్టుకుని చిత్రలహరి, ప్రతిరోజూ పండుగేతో నిలదొక్కుకున్నాడు. వరుణ్‌తేజ్ ఒకరోజు వచ్చి తాను సినిమాల్లోకి వస్తాననే ప్రపోజల్ పెట్టాడు. వద్దురా. అందరూ బంధుప్రీతి అనుకుంటారని వెనక్కినెట్టగలమా! అని ప్రశ్నించారు సత్యానంద్ వద్ద ట్రైనింగ్ తీసుకుని.. ఓకే అన్నాకే ప్రయత్నించడం ప్రారంభించాడు. అల్లు అరవింద్ సినిమా తీస్తానని చెప్పినా వద్దన్నా. వాడి కష్టం వాడినే పడనీ అని వదిలేశా. తరువాత అడ్డాల శ్రీకాంత్ వచ్చి కథ చెప్పాడు. ఆ తరువాత ఏడాదిపాటు వరుణ్ ఖాళీగా ఉన్నాడని గుర్తుచేశారు. మొదటి సినిమా బాగానే ఆడింది. ఆ సమయంలోనే క్రిష్ వచ్చి వరుణతో మంచి కథ ఉందంటూ కంచె తీశారు. ఆ తరువాత లోఫర్, మిస్టర్ వైఫల్యం చెందాయి. అయినా వరుణ్ ఎక్కడా ఒత్తిడి పడలేదు. ఆ తరువాత ఫిదా, ఎఫ్2తో అందుకున్నాడు. గద్దలకొండ గణేష్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు బాక్సర్ సినిమా కోసం మరింత శ్రమిస్తున్నాడు. ఇక్కడ మెగా ఫ్యామిలీ అని ఎవ్వరూ రెడ్‌కార్పెట్ వేయరు. కష్టపడితేనే ఫలితం.. నాని, విజయ్ దేవరకొండ వంటి వాళ్లకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. స్వయంగా వచ్చి సత్తాచాటి ఎదిగారు. అంతేకానీ బంధుప్రీతి. నెపోటిజం వంటివి ఇక్కడ చెల్లుబాటుకావు. బాలయ్యబాబు కేవలం ఎన్టీఆర్ తనయుడు ప్రేక్షకులు ఆదరించలేదు. తనలో దమ్ము, అద్భుతమైన నటన ఉండటం వల్లనే నందమూరి వారసుడుగా పేరు సంపాదించారంటూ నెపోటిజం అనేది ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపారేశారు. నిజమే కానీ.. అందరూ అలా భావిస్తారా! ఏమో.. నాగబాబు మాటల్లో నిజం ఉన్నా.. ప్రతిచోట.. ఏదో ఒక సపోర్టు కావాలనేది మాత్రం అందరూ భావించే వాస్తవం.