అమెజాన్ ప్రైమ్‌లో నానీ ..వి సినిమా!

ఇప్పుడంతా ఓటీటీల కాలం.. మొన్న‌నే ఆహాలో జోహార్ సినిమా విడుద‌లైంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ అందుకుంటుంది. కొత్త టాలెంట్‌కు క‌రోనా మ‌రింత అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది. సినిమా థియేట‌ర్లు లేక‌.. చిన్న సినిమాల విడుద‌ల ఆల‌స్య‌మ‌య్యేది. లాక్‌డౌన్ పుణ్య‌మాంటూ ఓటీటీ ద్వారా పేరు.. పైస‌ల్ రెండు సంపాదించుకునే వీలుంది. ఇప్పుడు అదే దారిలో సినీన‌టుడు నాని తొలిసారి విల‌న్‌గా చేసిన వి సినిమా అమెజాన్‌ప్రైమ్‌లో సెప్టెంబ‌రు 5వ తేదీన విడుద‌ల కానుంది. సుధీర్‌బాబు పోలీసు పాత్ర‌లో మెప్పిస్తే.. నాని విల‌న్‌గా మ‌రింత‌గా ర‌క్తిక‌ట్టించిన‌ట్టు సినిమా టీజ‌ర్‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. వాస్త‌వానికి ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తో ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here