ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆయనను ఘనంగా సత్కరించారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Previous article“బ్లడ్ రోజస్” చిత్ర యూనిట్ కు బాబు మోహన్ బెస్ట్ విషెస్, ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
Next articleఅంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here