హనమకొండ(వరంగల్), 22 నవంబర్ 2021: ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్, తమ ఔట్‌లెట్ల జాబితాలో నూతనంగా మరో కేంద్రాన్ని జోడించుకుంది. హనమకొండ వద్ద తమ చుట్టుపక్కల దర్శనీయ ప్రాంతాల సరసన ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆహార కేంద్రాన్ని ప్యారడైజ్ తీసుకువచ్చింది. హనుమకొండ వాసులు సైతం ఇప్పుడు ఓమ్నీ ఛానెల్ రెస్టారెంట్‌ను తమ తాజా ల్యాండ్‌మార్క్‌గా మార్చుకోవచ్చు.
చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండటంతో పాటుగా మూడు ప్రతిష్టాత్మకమైన నగరాలైనటువంటి వరంగల్, హనుమకొండ ఇప్పుడు అత్యుత్తమ వీకెండ్ గేట్‌వే కేంద్రంగా హైదరాబాద్ మరియు తెలంగాణా వాసులకు నిలుస్తుంది. వేయి స్థంభాల దేవాలయం కలిగిన ఈ నగరం ఇప్పుడు అత్యుత్తమ బిర్యానీ కేంద్రంగానూ నిలిచింది. హనుమకొండలో నూతన ఔట్‌లెట్ రావడంతో స్థానికులతో పాటుగా సందర్శకులకు సైతం చక్కటి విందు అందుబాటులోకి వస్తుంది.
అత్యుత్తమ బిర్యానీ , కబాబ్స్ మరియు మరెన్నో పదార్థాలను అతిథులు ఆస్వాదించవచ్చు. వీటిని అతిథులకు అసాధారణ నాణ్యత, పరిశుభ్రతతో అతి జాగ్రత్తగా ప్రస్తుత కాలంలో అవసరమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తారు. శాస్త్రినగర్ మెయిన్ రోడ్, సుబేదారి, హనుమకొండ వద్ద 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రెస్టారెంట్ ఉంది. హనమకొండ మరియు చుట్టు పక్కల ప్రాంతాల భోజనప్రియులు ఇప్పుడు ప్యారడైజ్ ప్రతిష్టాత్మక బిర్యానీ, కెబాబ్స్ మరియు డెసర్ట్స్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ నూతన రెస్టారెంట్ ఆవిష్కరణ గురించి శ్రీ అలీ హేమతి, ఛైర్మన్– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘మా నూతన ఔట్‌లెట్ ప్రారంభానికి ఆసక్తికరమైన ప్రాధాన్యతగా హనమకొండ నిలుస్తుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో పాటుగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు తరచుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ప్రయాణిస్తుంటారు. ఇక్కడ ప్యారడైజ్‌ను ప్రారంభించడం ఆలోచనాత్మకం. హైదరాబాద్ మరియు వరంగల్ నగరాల సంస్కృతులను ఒకే చోట తీసుకురావడంతో పాటుగా నిజామ్‌ల యుగం నాటి రాజరికం, కాకతీయ కాలం నాటి వైభవంను ప్రదర్శిస్తుంది. హనమకొండ నుంచి ఆహార ప్రియులు తమ అభిమాన బిర్యానీ కేంద్రాన్ని తమ ఇంటి ముంగిటనే కనుగొనవచ్చు. అంతేకాదు, వరంగల్‌లో వీకెండ్ గేట్‌వేలను కోరుకోవడానికి అత్యుత్తమ కారణమూ అందిస్తుంది. వెయ్యి స్తంభాల గుడి ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. అందువల్ల, ఇది వారసత్వ కట్టడాలను అమితంగా ఇష్టపడే వారితో పాటుగా ఆహార ప్రియులకు సైతం అంతే అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. వైభవం మరియు రుచికరమైన విందు సమ్మేళనంగా ఇది నిలుస్తుంది’’ అని అన్నారు.
‘‘హనమకొండలో మా నూతన ఔట్‌లెట్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిన్యానీని ఇక్కడకు తీసుకురావడం ద్వారా మేము దశాబ్దాల ప్యారడైజ్ వారసత్వంను వేడుక చేయడంతో పాటుగా హనమకొండలోని చారిత్రక వైభవాన్నీ వేడుక చేస్తున్నాము. సందర్శకులతో పాటుగా పర్యాటకులు సైతం ఇక్కడి విందు ఆస్వాదిస్తూ అద్వితీయ జ్ఞాపకాలను తమ వెంట తీసుకువెళ్లగలరు’’ అని డాక్టర్ కజీమ్ హేమతి, డైరెక్టర్– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు.
శ్రీ గౌతమ్ గుప్తా, సీఈవో– ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆహార కేంద్రాలలో ఒకటిగా , మా విస్తరణ ప్రణాళికలో భాగంగా, హనమకొండ మా 43 వ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి అత్యుత్తమ ఎంపికగా నిలిచింది. అంతేకాదు, ఇది తెలంగాణాలో భాగం. అందువల్ల నిజామీ వారసత్వం, కాకతీయుల వైభవపు సమ్మేళనంగా ఇది ఉంటుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆహారంను మేము తీసుకురావడంతో పాటుగా మా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణా వారసత్వంను చేరుకునే అత్యుత్తమ ఆహారాన్ని తీసుకురాగమనే భరోసా అందించగలము’’ అని అన్నారు.
ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జీహెచ్‌ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది



