దేశదేవ్యాప్తంగా ఐదేళ్లలో 10 రెట్లు విస్తరించనున్న ప్యారడైజ్‌

 

దేశదేవ్యాప్తంగా ఐదేళ్లలో 10 రెట్లు విస్తరించనున్న ప్యారడైజ్‌

హైదరాబాద్‌లోని శరత్‌ సిటీ మాల్‌ లో రెస్టారెంట్‌ను అనుసరించి తమ 50 వ రెస్టారెంట్‌ను మణికొండలో ప్రారంభించింది. తద్వారా 70 సంవత్సరాల వారసత్వపు బ్రాండ్‌ ప్రయాణంలో నూతన మైలురాయిని చేరుకుంది

హైదరాబాద్‌, 10 ఫిబ్రవరి 2022 : ప్రపంచంలో అతి పెద్ద బిర్యానీ గొలుసుకట్టు సంస్ధల్లో ఒకటైన ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌ నేడు దేశవ్యాప్తంగా తమ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఏడు దశాబ్దాల ప్యారడైజ్‌ బిర్యానీ 2026–27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా తమ రెస్టారెంట్ల సంఖ్యను 500కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెస్టారెంట్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలోనూ తెరువనున్నారు. ఈ విస్తరణను దేశంలోని టియర్‌ 1 మరియు టియర్‌ 2 నగరాలలో చేయడంతో పాటుగా నూతన ప్రాంతాలను సైతం తమ జాబితాలోకి తీసుకురానుంది.
ఈ కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరారంభం నాటికి42 రెస్టారెంట్లను నిర్వహిస్తుంది. 2022 ఆర్ధిక సంవత్సర రెండవ అర్ధసంవత్సరంలో తమ విస్తరణను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. అక్టోబర్‌ 2021 నుంచి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని వరంగల్‌, ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, కర్నూలు మరియు హైదరాబాద్‌లలో 8 రెస్టారెంట్లను తెరిచింది. ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ నూతన రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ప్రారంభించడం ద్వారా రెస్టారెంట్ల సంఖ్య 50ను దాటింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆహారాభిమానులకు సాటిలేని బిర్యానీ మరియు కెబాబ్‌ల అనుభవాలను అందించడంలో 70 సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర కలిగిన ప్యారడైజ్‌, ఈ క్యాలెండర్‌ సంవత్సరం ముగింపు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెస్టారెంట్‌ చైన్‌ ప్రస్తుతం ‘కంపెనీ ఓన్డ్‌ కంపెనీ ఆపరేటెడ్‌ రెస్టారెంట్‌’ నమూనాలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ఈ విస్తరణ ప్రణాళికలను గురించి శ్రీ గౌతమ్‌ గుప్తా, సీఈవొ, ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘గత కొద్ది సంవత్సరాలుగా, హైదరాబాద్‌ కలినరీ సంస్కృతి మరియు చరిత్రలో ప్యారడైజ్‌ అంతర్భాగంగా మారడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అతిథులకు మేము ఆతిథ్యమందించాము. మా అతిథుల చేత క్రమం తప్పకుండా మేము ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాము. హైదరాబాద్‌ను సందర్శించే ప్రతి ఒక్కరూ ప్యారడైజ్‌ బిర్యానీ రుచులు ఆస్వాదించకుండా వారి పర్యటన పూర్తయినట్లుగా భావించరు. ఈ ప్రేమే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మాకు ప్రోత్సాహమందించడంతో పాటుగా ప్యారడైజ్‌ బిర్యానీని ఫుడీస్‌ ఆస్వాదించేందుకు భరోసా కల్పిస్తుంది. మేము అత్యంత వేగంగా విస్తరించాలని ప్రణాళిక చేశాము తద్వారా మా బిర్యానీ చైన్‌ను 500 రెస్టారెంట్ల మార్కుకు తీసుకువెళ్లనున్నాము’’ అని అన్నారు.

‘‘ప్రస్తుత మహమ్మారి కారణంగా అధికశాత హోరేకా పరిశ్రమ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్యారడైజ్‌ బిర్యానీ మాత్రం తమ ప్రతిష్టాత్మక డిషెస్‌ పరంగా డిమాండ్‌ను అందుకుంటూనే ఉంది. మా నిర్వహణలోని అత్యధిక శాతం రెస్టారెంట్లు లాభదాయకంగా నడుస్తున్నాయి. మేము మా రెస్టారెంట్‌ నూతన ఔట్‌లెట్‌ తెరువడానికి ముందు చేసే అత్యంత లోతైన పరిశోధనతో పాటుగా శక్తివంతమైన మరియు సృజనాత్మక నిర్వహణ ప్రక్రియలు మరియు దశాబ్దాల నాటి ఆహార నాణ్యతను అదే రీతిలో కొనసాగిస్తుండటందీనికి కారణం. ఇప్పుడు మా లక్ష్యం టియర్‌ 1 మరియు టియర్‌2 నగరాలలో ప్యారడైజ్‌ రుచులను అందించే అవకాశం అన్వేషించడం. దక్షిణ భారతదేశపు మార్కెట్‌ అత్యంత క్లిష్టమైనది. ఇప్పుడు ఉత్తర, పశ్చిమ మరియు తూర్పు భారతదేశాలలో సైతం విస్తరించనున్నాం’’ అని గుప్తా అన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 13 నగరాలలో 50 రెస్టారెంట్లను ప్యారడైజ్‌ నిర్వహిస్తుంది. ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here