ప‌వ‌న్‌.. ఫ్యాన్స్‌కు వైబ్రేష‌న్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ పేరు విన్నా.. ఆ విజువ‌ల్ చూసినా నాకు బాడీలో ఇక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు క‌రెంట్ పాసవుతుంది.
– ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌

క‌ళ్యాణ్ గారిని బంగారం సెట్‌లో క‌లిశా.. ఆ స‌మ‌యంలో రాళ్లుకొట్టుకుని జీవించే భార్య‌భ‌ర్త‌లు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పిల్ల‌వాడిని తీసుకొచ్చి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతిలో పెట్టారు. వెంట‌నే ఆయ‌న మేనేజర్‌ను పిలిచి కారులో పిల్ల‌వాడిని రెయిన్‌బో పంపించారు. కోలుకునేంత వ‌ర‌కూ ఆయ‌నే ద‌గ్గ‌రుండీ కోఆర్డినేట్ చేశారు… ద‌ర్శ‌కుడు, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.

ఐయామ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటాడు బాలీవుడ్ బిగ్‌బీ త‌న‌యుడు అభిషేక్‌బ‌చ్చన్‌
నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌స‌నం అంటాడు నిర్మాత బండ్ల గ‌ణేష్
ప‌వ‌ర్‌స్టార్ అవ‌హించాడు.. సినీ హాస్య‌న‌టుడు స‌ప్త‌గిరి ..

నా 46 ఏళ్ల సిని అనుభ‌వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వంటి మ‌హోన్న‌త వ్య‌క్తిని చూడ‌లేదు. లైఫ్ ఈజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. నా ఆరోగ్యం స‌రిగా లేదంటే.. అమ్మా అంటూ ఆప్యాయంగా ప‌లుక‌రించి ల‌క్ష‌రూపాయ‌లిచ్చారు. -సినీ న‌టి పావ‌లా శ్వామ‌ల‌

ఎవ‌రో చెబుతుంటే విన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు వెళితే సాయం దొరుకుతుంద‌ని. ఒక‌రోజు ఆయ‌న ఇంటివ‌ద్ద‌కెళ్లా. ఆయ‌న మిసెస్ చూసి చెప్పిన‌ట్టున్నారు… మెట్లు దిగుతూ కింద‌కు వ‌చ్చారు. నేను రిటైర్డ్ ఎంప్లాయిన్ అని చెప్పా. అంత‌కుమించి ఇంకేమి మాట్లాడ‌లేదు. నా చేయి ప‌ట్టుకుని కారులో కూర్చోబెట్టారు. అప్ప‌టికే వ‌ర్షంలో త‌డిశా.. చెప్పులు తెగిపోయాయి. అలా వ‌చ్చి నా బ్యాగు సంక‌లో పెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు. అప్పుడు ఆశ్ర‌మంలో 16 మంది అనాథ‌లున్నారు. చ‌లికి వ‌ణ‌కుతున్న నాకు మంచి శాలువా ఇచ్చారు. అమ్మా కాఫీ, టీ ఏం తాగుతారంటే వ‌ద్ద‌న్నా.. వెళ్తాన‌న్నా.. కానీ ఆయ‌నే స్వ‌యంగా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగ‌మ‌న్నారు. టిఫిన్ ఏం ఏద్దామ‌న్నారు.. వ‌ద్ద‌న్నా విన‌లేదు. అర‌గంట అయినా మీరు తినేంత వ‌ర‌కూ వేచిచూద్దామ‌న్నారు. అమ్మా అంటూ ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. ప‌వ‌న్‌ను నేను నీకు అమ్మ‌ను.. నీకు కొడుకునంటూ అన్నాడు మొద‌టి రిసీవింగ్‌..చూడ‌గానే క‌న్నీరొచ్చింది. ఆ స‌మయంలో రైస్‌, పిష్ తెప్పించారు. ఎందుక‌మ్మా భ‌య‌ప‌డుతున్నారు. నేను నీకు బిడ్డ‌ను.. నీ కొడుకునంటూ మాట్లాడారు. వాళ్ల పీఏకు చెప్పి ల‌క్ష‌రూపాయ‌లు బ్యాంకులో ఎకౌంట్ ఇచ్చారు. ప‌దివేలిచ్చి ఇది నీ ఖ‌ర్చుల కోస‌మంటూ చెప్పారు. ఖ‌మ్మంలో వృద్ధాశ్ర‌మం న‌డిపే రిటైర్డ్ ఎంప్లాయ్ ల‌క్ష్మి అనుభ‌వం.

5అడుగుల 10 అంగుళాల ఎత్తు 75 కేజీల‌కు అటుఇటుగా ఉండే రివ‌ట‌లాంటి శ‌రీరం.. ఎందుక‌య్యా.. ప‌వ‌న్ అంటే అంత పిచ్చి అనే వాళ్ల‌కు ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు చూపే ఉదాహ‌ర‌ణ‌లివి. మొన్న‌టికి మొన్న కోటిరూపాయ‌లు సైనిక సంక్షేమం కోసం ఇచ్చారు. ఆప‌దొచ్చినా… అవ‌స‌రం వ‌చ్చినా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కెళితే క‌ష్టం తీరుతుంద‌ని న‌మ్మే ఎంద‌రికో ఆయ‌న ధ‌ర్మ‌దాత‌. కానీ.. అభిమానుల‌కు స్పూర్తిప్ర‌దాత‌. ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన‌రోజుకు వారం రోజుల ముందునుంచే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు.. దాదాపు 40 ల‌క్ష‌ల‌రూపాయ‌లుసేక‌రించిన జ‌న‌సైనికులు.. ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌లు అంద‌జేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆక‌లితో అల‌మ‌టించే ల‌క్ష‌లాది మంది ఆక‌లి తీర్చారు. వెండితెర‌పై క‌నిపించ‌గానే.. ఈల‌లు వేసి గోల చేసే ఫ్యాన్స్ అంద‌రికీ ఉండొచ్చు. కానీ.. ప‌వ‌న్ మాట‌లు.. ఆచ‌రిస్తూ.. అదే మార్గంలో న‌డిచేందుకు జ‌న‌సైనికులుగా మేమున్నామంటున్నారు.

సెప్టెంబరు 2 తేదిన నసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా జనసేన నాయకులు వేడుకలను 3రోజులు చేయదలిచారు.మొదటి రోజు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో శీరందాసు సతీష్ సహకారంతో 13వర్డు కనకదుర్గమ్మ ఆలయం వద్ద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు,10కే.జి బియ్యం, 1కే.జి నూనె, కందిపప్పు, మినపప్పు, పంచదార అందజేశారు.ముఖ్య అతిధి గా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవచేయడానికి జనసేన సైనికులు ముందుంటారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే covid-19లో ఎక్కువగా సేవలు చేస్తనేఉన్నారు.ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చిన అందుకోవడానికి జనసైనికులు ఉంటారు. అలాగే covid ఉన్న పేద వారికి మందులు కూడా ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర చిరంజీవి యవత జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు గోపీకృష్ణ, జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, పట్టణ ఉపాధ్యక్షుడు మారిశెట్టి అజయ్ బాబు, కోశాదికారి గుండుమోగుల సురేష్, కార్యదర్శులు నిలపాల దినేష్, మద్దాల మణికుమార్, కొవ్వాడ పెదకాపు, ప్రచార కార్యదర్శి యంట్రపాటి రాజు,యవర్న సోమశేఖర్ పాల్గొన్నారు.

Previous articleCelebrity choreographer Terence Lewis makes his move from the dance floor to your mobile screen with a new show by Flipkart Video
Next articleస్టార్‌.. స్టార్‌.. ప‌వ‌ర్‌స్టార్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here