అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. హమ్మయ్య.. ఇక రచ్చ ముగిసింది అనుకున్నారు. కానీ.. జనసేనాని పవన్‌కళ్యాణ్ మాత్రం ఇంతటితో విషయం సమసిపోలేదంటున్నారు. పైగా ఇప్పటికే ఏపీలో జరిగిన అన్ని దేవాలయాలపై దాడులను సీబీఐ పరిధిలోకి తేవాలంటూ డిమాండ్ చేశారు. పనిలో పనిగా దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని భూముల అన్యాక్రాంతంపై కూడా దృష్టిసారించమంటున్నారు. ఇక్కడ దాదాపు అన్నిపార్టీలకు మంటపుడుతుందట…ఎందుకంటే.. దేవుడంటే.. అందరివాడు.. తన మన అనే బేధం లేకుండా వరాలచ్చే రూపుడు. కాబట్టి.. ఆయన ఆస్తిలో మాకూ బాగం ఉందని.. ఏవో కొన్ని వందల ఎకరాలు అక్రమించుకున్నారు. పైగా వాటికి పట్టాదారుపాస్‌పుస్తకాలు సంపాదించటం.. కోట్లాదిరూపాయలకు అమ్ముకోవటం కూడా జరిగాయి. ఇప్పుడు పవన్ మళ్లీ వాటన్నింటినీ వెనక్కి ఇవ్వమంటే ఎలా! అప్పనంగా వచ్చిన సొత్తును స్వాహాచేసిన బ్యాచ్‌లో అందరికీ పాపం ఉన్నట్టుంది పవన్ సారూ!
పోన్లే అనుకుంటే.. తిరుమల దేవాలయంలో పింక్‌డైమండ్. అప్పట్లో చంద్రబాబునాయుడు తిరుమలలోని వజ్రవైడ్యూర్యాలను అమ్ముకుని.. సొమ్ముచేసుకున్నాడంటూ.. చెన్నైలో ఉండే శేఖర్‌రెడ్డి ని బినామీ చూపారు. దీంతో వైసీపీకు మాంచి బూస్ట్ వచ్చినంత పనైంది. టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అయితే ఏకంగా హైదరాబాద్, బెజవాడల్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పింక్‌డైమండ్ ఎక్కడంటూ నిలదీసిన వైసీపీ కూడా అధికారం చేపట్టాక దీన్ని పట్టించుకోవటం మానేసింది. నాడు బినామీ అన్న శేఖర్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ మెంబర్‌ను చేసింది. ఇన్ని విపరీత పరిణామాల మధ్య పవన్ వచ్చి శ్రీకృష్ణదేవరాయ సమర్పించిన పింక్‌డైమండ్ ఎక్కడ ఉందనే దానిపై సీబీఐ విచారణ అడిగితే ఎలా! ముందు అంతర్వేది లో అసలేం జరిగిందనే విషయం బయటకు వస్తే.. ఆ తరువాత మిగిలిన వాటి సంగతి చూద్దామంటున్నాయట హిందూ సంఘాలు. ఇంతకీ.. వైసీపీ సర్కార్ నిజంగానే వీటన్నింటిపై కూడా సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నా యంటారా! అనే అనుమానం పక్కనబెడితే.. నాడు ఛీ.. సీబీఐ నా ఇలాఖాలోకి కాలు పెడుతుందా! చూస్తానంటూ.. జీవో జారీచేసి వద్దన చంద్రబాబుతో పోల్చితే.. పాలనలో తన మార్కు చూపాలని తపన పడుతున్న సీఎం జగన్ మోహన్‌రెడ్డి చాలా ఉత్తమం అనే క్రెడిట్ మాత్రం కొట్టేశారు.



