పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వార్త అయినా అభిమానులకి ఆ కిక్కే వేరు! ఈ రోజు వకీల్ సాబ్ షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రో రైలులో మాదాపూర్ నుండి మియాపూర్ వరకు ప్రయాణించారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో తన మొదటి ప్రయాణాన్ని పవన్ కళ్యాణ్ ఆనందించారని షూటింగ్ లో పాల్గొన్న వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ సామజిక సమస్యల పట్ల ఉన్నఆసక్తితో తనతో పాటు పాటు రైలులో ప్రయాణిస్తున్న ఒక రైతుతో మాట్లాడారు. ఇటీవల భారీవర్షాలకు జరిగిన పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో వున్నారు



