గూగుల్ సెర్చ్ లో కూడా పవన్ టాప్


-గూగుల్ సెర్చ్ లోనూ ‘జనసేనాని’ దూకుడు
– గూగుల్ సెర్చ్ – 2024 ప్రభావిత వ్యక్తుల్లో ఆయన ఒకరు
– ఏపీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ స్థానాల కైవసంతో రికార్డు
– దేశవ్యాప్త సంచలన గుర్తింపు ఫొందిన ‘సనాతన ధర్మ నినాదం’
– దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే ఒక్కడుగా నిలిచిన ‘పవన్ కళ్యాణ్’
– అంతర్జాతీయ స్థాయిలో ‘పవన్’ కి విశ్లేషకుల ప్రశంసలు
—————–
అమరావతి:
గూగుల్ 2024లో దేశవ్యాప్తంగా ఎక్కువమంది వెతికిన పేర్లు, వివిధ అంశాలకు సంబంధించిన జాబితా తాజాగా విడుదలైంది.  ఈ జాబితాలో 2024లో మన దేశంలో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పేర్లలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు సైతం ఉంది. మొత్తంగా 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో టాప్ లో నిలిచిన వ్యక్తుల సహా వివిధ అంశాలకు సంబంధించి గూగుల్ విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఒక్కటి మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో 5వ స్థానంలో నిలిచారు. ఏపీలో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ప్రధాని మోడీ ప్రశంసలతో పాటు పవన్ లేవనెత్తిన అంశాలు ఆయనని అంతా సెర్చ్ చేసేలా చేశాయి. మరోవైపు ఆయన నటిస్తోన్న ‘ఓజీ’ సినిమా కూడా యాడ్ అవడంతో.. అటు రాజకీయ జీవితం, ఇటు సినిమా జీవితం ఆయనకు మరింతగా ప్రజా ఆసక్తిని తెచ్చి పెట్టి.. 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలబెట్టింది.

*తుఫాను ప్రభంజనం ఆయనది..*:
ప్రధాని మోదీ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు.. అభిమాన తుఫాన్ అనే మాట సర్వత్రా వినిపిస్తుంది. మొన్న మహారాష్ట్ర ఎన్నికలలోనూ ఎన్డీఏ కూటమి తరఫున ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ తన సత్తాను చాటుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో సమాచారం కోసం గూగుల్‌లో ప్రతి రోజూ ఏదొకటి వెతుకుతూనే ఉంటాం. గుండు పిన్ను నుంచి అత్యంత లగ్జరీ కారు వరకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో ఇట్టే దొరుకుతుంది. మనకు తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవాలనే గూగుల్ తల్లిని అడగాల్సిందే కదా.. మరి 2024 ఏడాదికి మరో 20 రోజుల్లో గుడ్ బై చెప్పబోతున్నాము. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం గూగుల్‌లో భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారంటూ ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు 2024లో గూగుల్ 2024 సెర్చ్ ట్రెండింగ్ జాబితాను విడుదల చేశారు.

*టాప్ సెర్చ్ జాబితాలో స్థానం*:
2024లో గూగుల్‌లో మన దేశంలో ఎక్కుగా వెతికింది ఐపీఎల్ గురించే.. గూగుల్‌ ఓవరాల్‌ జాబితాలో ఈ టీ20 టోర్నీ టాప్‌లో ఉంది. సార్వత్రిక ఎన్నికల గురించి జనాలు వెతికారు. అలాగే రతన్ టాటా, సినిమాల్లో స్ట్రీ2, ప్రభాస్‌ నటించిన కల్కి, సలార్‌.. తెలుగు సినిమా హనుమాన్ గురించి సెర్చ్‌ చేశారు. హీరామండీ, మీర్జాపూర్‌ షోల సమాచారాన్నీ గూగుల్‌లో వెతికారు. వ్యక్తుల పేరుతో వెతికిన జాబితాలో టాప్‌లో.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్‌ ఫొగాట్‌ ఉన్నారు. బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాస్వాన్‌, హార్దిక్ పాండ్యా, జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కూడా టాప్‌ సెర్చ్‌ జాబితాలో ఉన్నారు. ఆయన వ్యక్తుల జాబితాలో ఆయన ఐదో స్థానంలో  . దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన పేరు మాత్రమే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఇక ఏపీకి పరిమితమయ్యే లోకల్ కాదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగల నాయకుడని విశ్లేషకులు ప్రశంసలు కురిపించడం గమనార్హం.
————

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here