ఆడు మగాడ్రా ఎవడైనా కొపంగా కొడతాడు బలంగా కొడతారు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గోడ కడుతున్నట్టు. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు. వాడు మగాడ్రా బుజ్జీ. ఇండియా బోర్డర్‌లో ఇదే సీన్ రిపీట్. నిశ్చబ్దం ఎంత భయం కరంగా ఉంటుందో.. చైనా కు రుచిచూపించాడు. నరేంద్రమోదీ అంటే.. కాషాయ పార్టీ జెండా పట్టుకుని సౌమ్యంగా ఉంటాడనుకున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీకు వణకు పుట్టించేలా చేశాడు. మే నెలలో చైనా సైనికులు భారత్ భూబాగాలపై కన్నేశారు. కరోనాతో ప్రపంచమంతా పోరాటం చేస్తూంటే.. తాను మాత్రం ఇతర దేశాల భూబాగాన్ని అప్పనంగా కాజేసేందుకు అవకాశంగా మలచుకుంది. చిన్నదేశాలైతే మౌనంగా భరించాయి. కానీ అది అజేయమైన భారత్. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అకస్మాత్తుగా దాడిచేస్తే వెనుకంజ వేసిన భారతీయ సైన్యమే ఇప్పటికీ ఉందని జింగ్ పింగ్ గుంటనక్క ఎత్తులు వేశాడు. జూన్ 6న ఒప్పందానికి వ్యతిరేకంగా 22న ఫాంగాంగ్ సరసు వద్ద ఇండియన్ సైనికులపై దాడి చేయించాడు. ఫలితంగా 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా చేసిన పెద్ద తప్పు అదే అని తెలుసుకునేలోపుగా.. ఇండియన్ ఆర్మీ చైనా సైనికులపై విరుచుకుపడింది.. కుత్తుకలు ఎన్ని తెగాయో.. ఎంతమంది పారిపోయారనేది చీకటికే తెలియాలి. దాదాపు చాలా రోజుల వరకూ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా చీనీయులు జాగ్రత్తపడ్డారు. ఆ తరువాత అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ద్వారా ప్రయత్నాలు చేసి పరువు పోగొట్టుకున్నారు. చివరకు భారత్ చైనాతో వాణిజ్యసంబంధాలు తెగతెంపుల వరకూ చేరింది. దాదాపు 22 చైనా యాప్‌లను తొలగించింది. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. అంతే.. చైనాకు ఏం చేయాలో అర్ధం కాలేక.. ఉలికిపాటుకు గురైంది.
కానీ.. భారత్‌ను దెబ్బతీయాలనే కుతంత్రం మాత్రం విడచిపెట్టలేదు. అవినీతికి అలవాటుపడిన అధికారుల ద్వారా భారత సైన్యం వివరాలు.. నిఘా విషయాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 10,000 ప్రముఖుల పై కన్నేసిందంటే చైనా ఎంతటి కుయుక్తితో ఉందనేది అర్ధమవుతుంది. ఫాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 4 వరకూ నాదేఅంటున్న చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంపై కన్నేసింది. తమను భారత్ మోసం చేస్తుందంటూ మొసలికన్నీరు కార్చుతుంది. చైనా తొండాట అడుతూ భారత్‌ను కార్నర్‌గా చేయాలని అంతర్జాతీయ వేదికలపై గళమెత్తుతుంది. కానీ.. ఏ దేశమూ చైనాకు సంఘీభావం చెప్పక పోవటంతో భారత్‌తో యుద్ధానికి దాదాపు సిద్ధమైంది. లక్ష మంది సైనికులను బోర్డర్ లో ఉంచింది.
1962 కు ముందు కూడా చైనా.. నాలుగైదేళ్ల పాటు దోబూచులాడింది. భారత్ ఏమరపాటుగా ఉన్న సమయాన్ని అవకాశం చేసుకుని దాడి చేసింది వేలాది కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ నాడు నెహ్రు.. చీనీ_భారత్ బాయిబాయీ అంటే నమ్మాడు. కానీ.. ఇప్పుడు ఉంది. నరేంద్రమోదీ.. ప్రధానిగానే కాదు.. భారతీయుడుగా ఆలోచిస్తున్నాడు. తానే బోర్డర్‌లో పహారా కాసే సైనికుడుగా మారాడు.మైనస్ 40 డిగ్రీల వాతావరణంలో యుద్ధం చేసే సైనికులను భుజం తట్టేందుకు తానే స్వయంగా లడ్డాఖ్ వెళ్లాడు. పర్వతాల్లో యుద్ధం చేయటంలో నేర్పరులైన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్న చైనాకు తొలిసారి ఆ ఫోర్స్ దెబ్బ ఎంత వాడిగా.. వేడిగా ఉంటుందో రుచిచూపించి.. ఇది శాంపిల్ మిత్రమా.. అంటూ చైనాకు స్వీట్
వార్నింగ్ ఇచ్చాడు మోదీ. స్వయంగా మోదీ బోర్డర్‌కు వెళ్లటంతో సైనికుల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆర్మీచీఫ్ కూడా.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ నాడు నెహ్రూ ఆలోచించలేకపోయిన విదేశాంగ విధానంపై మోదీ దృష్టిఉంచారు. రాజ్‌నాథ్‌సింగ్ ద్వారా మిత్రదేశాలతో యుద్ధసన్నాహాల సాయం కోరారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ శాంతియుత వాతావరణం కోరుకుంటుంది.. కాదని.. ప్రత్యర్థులు ఒకడుగు ముందుకు వేస్తే.. మా సైనికుల చేతిలో తుపాకులు సమాధానం చెబుతాయంటూ చెప్పకనే చెప్పారు. చైనా మెత్తటి కత్తి దించాలనుకుంటే.. అంతకు మించిన సుతిమెత్తని ఆయుధం భారత్ చేతిలో ఉందంటూ హెచ్చరిక పంపారు. రణమంటూ వస్తే.. రానీ.. శరణు కోరేవరకూ తరమితరిమి కొడతామంటూ సైన్యం ఇచ్చిన ధీమా..భారతీయుల గుండెలమీద చేయివేసుకుని హాయిగా నిద్రపోయేందుకు కారణం.