గోల్డ్‌ లోన్‌పై రేట్లు తగ్గించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్

అక్టోబర్‌ 13, 2021: పండగ సీజన్‌లో మరింత ఆనందాన్ని అందించేందుకు రకరకాల డీల్స్, ఆఫర్స్‌తో గతంలో ఎన్నడు లేని రీతిలో తన బ్యాంకింగ్‌ సేవలు, లావాదేవీలను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అత్యంత ఆకర్షణీయంగా మార్చింది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్‌ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందిస్తోంది.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)పై 7.2%, బంగారు అభరణాలపై 7.30% రేటుకు పీఎన్‌బీ ఇప్పుడు రుణాలు అందిస్తోంది.

అంతే కాదు హోమ్‌ లోన్‌ రేట్లను కూడా పీఎన్‌బీ తగ్గించింది. అవి ఇప్పుడు 6.60% నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే 7.15%తో కారు లోన్స్‌, 8.95% రేటుకు పర్సనల్‌ లోన్స్‌ను ఖాతాదారులు ఇప్పుడు పొందవచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో ఇది అతి తక్కువ.

ఇటీవల హోమ్‌లోన్స్‌, వెహికిల్‌ లోన్‌పై ప్రకటించిన విధంగా ఇప్పుడు పండగ సీజన్‌లో బంగారు అభరణాలు, ఎస్‌జీబీపై సర్వీస్‌ ఛార్జీలు/ప్రాసెసింగ్‌ ఫీజును పీఎన్‌బీ పూర్తిగా తొలగించింది.

హోమ్‌ లోన్స్‌పై మార్జిన్స్‌కు కూడా బ్యాంక్‌ తగ్గించింది. హోమ్‌లోన్‌ తీసుకోదలిచిన వారు రుణ మొత్తంపై ఎటువంటి అప్పర్‌ సీలింగ్‌ లేకుండా ఆస్తి విలువలో ఇప్పుడు 80% వరకు పొందవచ్చు.

వడ్డీ రేటు తగ్గింపు, ప్రాసెసింగ్‌ ఫీజు తొలగింపు కారణంగా ఈ సీజన్‌లో పీఎన్‌బీ అందిస్తున్న అన్ని రిటెయిల్‌ లోన్‌ ఉత్పత్తులపై అత్యంత సరసమైన ధరకు నిధులు అందుబాటులో ఉన్నాయి

Previous articleపాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్
Next articleమెగా ఫ్యామిలీ చుట్టూ స్నో పాయిజ‌న్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here