పాటలు షూటింగ్ లో ‘పోలీస్ వారి హెచ్చరిక’

నల్లపూసలు ఫేం ” బాబ్జీ” దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ” పోలీస్ వారి హెచ్చరిక ” చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్ యారాడా బీచ్, నకిరేకల్ లాండ్స్, యస్ స్టూడియో మొదలైన లొకేషన్లలో ఈ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వరపరచి సంచలనం సృష్టించి, రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు, పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు “గజ్వేల్ వేణు” ను ఈ సినిమా ద్వారా వెండితెరకు
పరిచయం చేస్తున్నామని దర్శకుడు బాబ్జీ తెలిపారు.

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే నల్గొండ లో క్లైమాక్స్
సన్నివేశాలను చిత్రీకరించడం తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ” తెలిపారు.

తారాగణం : అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ ,
హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు.

కెమెరా : నళినీ కాంత్

సంగీతం : గజ్వేల్ వేణు
ఎడిటర్ : శివ శర్వాణి
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు
నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు
నిర్మాత : బెల్లి జనార్థన్
రచన , దర్శకత్వం : బాబ్జీ

పి ఆర్ ఓ .మధు వి .ఆర్

Previous article‘లక్ష్మీకటాక్షం’ ఫస్ట్ లుక్ విడుదల
Next articleజితేందర్ రెడ్డి నుండి మంగ్లీ కొత్త పాట “లచ్చిమక్క” లిరికల్ సాంగ్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here