ఉత్తరాంధ్ర.. బతుకు చిత్రాలకు నిదర్శనం. పాలకులు మారుతున్న అవే జీవితాలు. రాజకీయంగా.. సామాజికంగా చైతన్యవంతులు. అటువంటి ప్రాంతంలో విసిరేసినట్టుగా ఉండే శ్రీకాకుళం జిల్లా. ఒడిషాకు సమీపంలో భిన్నకల్చర్ల సమ్మేళనం. భాష… యాస.. వేషం అన్నీ వైవిధ్యమే. రౌతాంగ పోరాటం. నక్సల్బరీ.. తెలంగాణ సాయుధ పోరుకు శ్రీకాకుళమే కేంద్రం. అంతటి రాజకీయ ప్రభావితం గల జిల్లాలో రాజకీయ పార్టీలు వేదికగా మలచుకుంటున్నాయి. ప్రశాంతమైన చోట చిచ్చుపెట్టి ప్రజలను విడదీసి తాము లాభపడుతున్నాయి. డాక్టర్ గౌతు లచ్చన విగ్రహం దేవాలయ భూముల్లోఉందని.. దాన్ని తొలగించటంతోనే ఆక్రమణల వ్యవహారానికి శ్రీకారం చుడతామంటూ మంత్రి అప్పలరాజు కామెంట్ చేశాడు. టీడీపీను రెచ్చగొట్టినంత పనిచేశాడు. అంతే.. వైసీపీ విసిరిన సవాల్‌తో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పోటాపోటీగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. గౌతు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తున్నాయి. గౌతు లచ్చన్న అనే నాయకుడు కుటుటుంబ ప్రస్తుతం టీడీపీలో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
బీసీ, గిరిపుత్రులు అధికంగా ఉండే శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోట. అటువంటి చోట వైసీపీ పాగా వేసింది. పట్టును పూర్తిగా నిలుపుకునేందుకు స్పీకర్ పదవి.. మంత్రి గిరి ఆ జిల్లాకే అప్పగించింది. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని చుక్కలు చూపుతూ వస్తున్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ స్కామ్‌లో అరెస్ట్ కావటంతో.. అక్కడ దాదాపు టీడీపీ సైలెంట్ అయినట్టుగానే భావించారు. స్పీకర్ కూడా స్వరం పెంచటం.. జిల్లాలో అన్నీ తానై చక్రం తిప్పటం ప్రారంభించాడు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఏపీ సర్కారు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఎంపీ రామ్మూర్తినాయుడి నోరు నొక్కేశారు. గౌతు లచ్చన్న కుటుంబం టీడీపీలో ఉండటంతో.. విగ్రహం రాజకీయం మొదలుపెట్టారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. మంత్రి అప్పలరాజు మాత్రం విగ్రహాన్ని తొలగించి తీరుతామంటూ తేల్చిచెప్పారు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో రాజకీయ రచ్చ మున్ముందు ఎంత వరకూ చేరుతుందనేది కాలమే నిర్ణయించాలి.