మిరాయ్ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ మరియు చైనీస్ జపనీస్ లాంటి ఇంటర్ నేషనల్ భాషల్లో కూడా విజయవంతంగా డబ్బింగ్ వర్క్స్ పూర్తి చేసి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్.
మొన్న కార్తికేయ 2 , నిన్న మహారాజా, నేడు మిరాయ్… వీళ్ళ దగ్గర డబ్బింగ్ జరుపుకున్న ప్రతి సినిమా డబల్ ధమకానే… టాలివుడ్ లో మొట్టమొదటిసారిగా డబ్బింగ్ ఏజెన్సీ కల్చర్ ను తెచ్చి డబ్ కాస్టింగ్ కూడా వీల్లే చూసుకుంటున్నారు. ఈ విధానాన్ని మిరాయ్ సినిమాతో మొదలు పెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు.
హైదరాబాద్ లో ప్రముఖ రికార్డింగ్ మరియు డబ్బింగ్ స్టూడియో అయిన వారాహి స్టూడియోస్ వీరిదే. మిరాయ్ విడుదల సందర్భంగా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్, మరియు వారాహి స్టూడియోస్ హెడ్ “మహారాజ” వసంత్ ఈ విధంగా తెలియజేసారు.